For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 వరల్డ్ రికార్డు: గబ్బాలో రోహిత్ శర్మ సాధించేనా?

India vs Australia: Rohit Sharma looks to beat Virat Kohli in race for T20I World Record

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 బుధవారం జరగనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం మధ్యాహ్నం 1.20 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ రికార్డు కోసం పోటీపడబోతున్నారు.

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచేందుకు రోహిత్ శర్మ ఇంకో 65 పరుగులు చేయాల్సి ఉండగా.. విరాట్ కోహ్లి 170 పరుగుల దూరంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.

అగ్రస్థానంలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్

అగ్రస్థానంలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ (2271)అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 75 మ్యాచ్‌ల్లో గుప్తిల్ ఈ స్కోరుని సాధించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 87 మ్యాచ్‌ల్లో 2,207 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

మూడో స్థానంలో షోయబ్ మాలిక్

మూడో స్థానంలో షోయబ్ మాలిక్

పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ 108 మ్యాచ్‌ల్లో 2,190 పరుగులతో మూడో స్థానంలో ఉండగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ 71 మ్యాచ్‌ల్లో 2,140 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈజాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 2,102 పరుగులతో ఉన్నాడు.

 టాప్-5 కోహ్లీ యావరేజే ఎక్కువ

టాప్-5 కోహ్లీ యావరేజే ఎక్కువ

కోహ్లీ 62 మ్యాచ్‌ల్లోనే ఈ స్కోరు సాధించాడు. కాగా, టాప్-5లో అందరి కంటే ఎక్కువ యావరేజి(48.88)తో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. టాప్-2లో ఉన్న రోహిత్ శర్మ యావరేజి 33.43గా ఉంది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నారు.

Story first published: Tuesday, November 20, 2018, 17:59 [IST]
Other articles published on Nov 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+