ధోనీ రికార్డును బద్దలు కొట్టిన పంత్.. ఈ సారి 15మందిని..


పెర్త్: ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా అడుగుపెట్టిన టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ రికార్డుల పరంపర మొదలుపెట్టాడు. ఇలా రిషబ్ పంత్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఏకంగా 11 క్యాచ్‌లతో ప్రపంచ రికార్డు సాధించిన వికెట్ కీపర్ పంత్.. పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత కీపింగ్ దిగ్గజం ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలుకొట్టాడు. ఆసీస్‌తో ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు.

ఒకే టెస్టు సిరీస్‌లో 14 మంది
ఆతిథ్య ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ షమీ బౌలింగ్‌లో షాన్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో 15 ఔట్లలో పంత్ కీలకపాత్ర పోషించాడు. దీంతో గతంలో ఒకే టెస్టు సిరీస్‌లో 14 మంది ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఔట్లలో భాగంగా నిలిచిన ధోనీ, సాహా, సయ్యద్ కిర్మాణీలను పంత్ వెనక్కి నెట్టేశాడు.

పెర్త్ టెస్టులో షాన్ మార్ష్ క్యాచ్ పట్టడంతో
ఆస్ట్రేలియాతో 1979/80 సిరీస్‌లో కిర్మాణీ (11 క్యాచ్‌లు, మూడు స్టంపింగ్‌లు), ధోనీ 2012/13లో భారత్‌లో జరిగిన సిరీస్‌లో (9 క్యాచ్‌లు, 5 స్టంపింగ్‌లు), 2014/15లో ఆస్ట్రేలియాలో (13 క్యాచ్‌లు, 1 స్టంపింగ్), 2014/15లో భారత్‌లో జరిగిన సిరీస్‌లో సాహా 13 క్యాచ్‌లు ఒక స్టంపింగ్ చేశాడు. అయితే పెర్త్ టెస్టులో షాన్ మార్ష్ క్యాచ్ పట్టడంతో పంత్ 15 మంది ఆసీస్ క్రికెటర్ల ఔట్లలో భాగమైయ్యాడు.

కేవలం క్యాచ్‌ల రూపంలోనే 15 వికెట్లను
ఇలా 15 మందిని అవుట్ చేయడంలో పంత్ విశిష్టత వేరు. పంత్ మొత్తం 15 వికెట్లను కేవలం క్యాచ్‌ల రూపంలోనే అందుకోవడం విశేషం. అడిలైడ్‌లో జరిగిన టెస్టులో పంత్ 11 క్యాచ్‌లు అందుకోగా, రెండో టెస్ట్‌లో ఇప్పటివరకు 4 క్యాచ్‌లు పట్టడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications