రెండో వన్డేకు పంత్ దూరం.. కారణం ఇదే!!

ముంబై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాజ్‌కోట్‌లో జరగనున్న రెండో వన్డేకు వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూరం అయ్యాడు. పంత్ తల అదరడం (కంకషన్)తో బీసీసీఐ అతనికి విశ్రాంతిని ఇచ్చింది. రెండో వన్డే కోసం టీమిండియా బుధవారం రాజ్‌కోట్‌కు వెళ్ళింది. అయితే పంత్ టీమిండియాతో రాజ్‌కోట్ వెళ్లకుండా ముంబైలో బీసీసీఐ పర్యవేక్షణలోనే ఉన్నాడు. ఇక్కడి నుండి బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లనున్నాడని సమాచారం తెలుస్తోంది.

రెండో వన్డేకు పంత్ దూరం
'పంత్ రెండో వన్డే నుండి తప్పుకున్నాడు. పునరావాస ప్రోటోకాల్ సమయంలో అతను ఎలా స్పందిస్తాడో చూడాలి. మూడో వన్డే ఆడుతాడో లేదో ఇప్పుడే చెప్పలేం' అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 'మొదటి వన్డేలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంత్ కంకషన్‌కు గురయ్యాడు. స్పెషలిస్ట్ బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు. స్కానింగ్ రిపోర్టులు అన్ని బాగానే ఉన్నాయి. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. పునరావాస ప్రోటోకాల్ కోసం బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళతాడు' అని పేర్కొంది.

పంత్‌కు కంకషన్
వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో 44వ ఓవర్లో ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో పంత్ గాయపడ్డాడు. కమిన్స్ వేసిన బంతి ముందుగా బ్యాట్‌కు తగిలి ఆ తర్వాత అతని తలకు బలంగా తాకి క్యాచ్‌గా మారింది. ఇన్నింగ్స్ అనంతరం పంత్ 'కన్‌కషన్'కు (తల తిరగడం) గురైనట్లు బీసీసీఐ ప్రకటించింది. రెండో ఇన్నింగ్స్‌లో అతడు మైదానంలోకి రాలేదు. పంత్ బదులు కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేశాడు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మనీశ్ పాండే ఫీల్డింగ్ చేశాడు. పంత్ 28 (33 బంతుల్లో; ఫోర్లు 2, సిక్స్ 1) పరుగులు చేసాడు.

రాజ్‌కోట్‌లో రెండో మ్యాచ్
తొలి వన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (91 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (61 బంతుల్లో 47; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మిచెల్ స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 37.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 258 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' వార్నర్ (128 నాటౌట్), ఫించ్ (110 నాటౌట్) అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. సిరీస్‌లో ఆసీస్ 1-0తో ముందంజ వేసింది. రెండో మ్యాచ్ ఈ నెల 17న రాజ్‌కోట్‌లో జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications