Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘నర్వస్‌ 90 సిండ్రోమ్‌’ను అధిగమించడానికి సాయం చేసింది ఎవరంటే: పంత్

India vs Australia: Rishabh Pant reveals what helped him overcome the ‘nervous 90s’ syndrome

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. దూకుడుగా ఆడిన పంత్ త‌క్కువ బంతుల్లోనే సెంచరీ సాధించ‌డం విశేషం. 138 బంతుల్లోనే 8 ఫోర్ల‌ సాయంతో రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు.

తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఆస్ట్రేలియాలో భార‌త్ వికెట్ కీప‌ర్‌లు ఎవ‌రూ టెస్ట్ సెంచ‌రీ సాధించ‌లేదు. తొలిసారి పంత్ ఆ ఘన‌త సాధించాడు. భారత్ తరుపున ఇప్పటివరకు తొమ్మిది టెస్టులాడిన రిషబ్ పంత్‌కు ఇది రెండో సెంచరీ.

టెస్టుల్లో పంత్‌కు ఇది రెండో సెంచరీ

టెస్టుల్లో పంత్‌కు ఇది రెండో సెంచరీ

గతేడాది ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో పంత్ 114 ప‌రుగులతో సెంచరీ చేసిన సంగ‌తి తెలిసిందే. సిడ్నీ టెస్టులో 189 బంతులాడి 159 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాదు జెఫ్రీ డుజాన్ త‌ర్వాత‌ ఇంగ్లాండ్‌లోనూ, ఆస్ట్రేలియాలోనూ సెంచ‌రీలు చేసిన ప‌ర్యాట‌క జ‌ట్టు వికెట్ కీప‌ర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. దీంతో పాటు ఒక టెస్ట్ సిరీస్‌లో 200 కంటే ప‌రుగులు, 20 క్యాచ్‌లు అందుకున్న ఉప‌ఖండ‌పు తొలి వికెట్ కీప‌ర్‌గా రిషబ్ అరుదైన ఘనత సాధించాడు. కాగా, గతంలో రెండు సార్లు రిషబ్ పంత్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు.

నర్వస్‌ 90 సిండ్రోమ్‌ అధిగమించడంపై

నర్వస్‌ 90 సిండ్రోమ్‌ అధిగమించడంపై

ఈ సారి మాత్రం ‘నర్వస్‌ 90 సిండ్రోమ్‌'ను చాలా సులభంగా అధిగమించాడు. అయితే, నర్వస్‌ 90 సిండ్రోమ్‌ను అధిగమించడానికి కారణం మాత్రం అవతలి ఎండ్‌లో ఉన్న రవీంద్ర జడేజానే అని అన్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా రిషబ్ పంత్... రవీంద్ర జడేజా(81)తో కలిసి ఏడో వికెట్‌కు అతడు 204 పరుగుల బాగస్వామ్యం నెలకొల్పాడు. మ్యాచ్ అనంతరం 20, 30ల వద్ద ఔటయ్యే వాడివి కదా? ఆట తీరులో మార్పులేవైనా చోటు చేసుకున్నాయా అన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించాడు.

నా ఆటలో ఎలాంటి మార్పు లేదు

నా ఆటలో ఎలాంటి మార్పు లేదు

"నా ఆటలో ఎలాంటి మార్పు లేదు. ఈ సారి అవతలి ఎండ్‌లో మంచి బ్యాట్స్‌మన్‌ ఉన్నాడు. చాలాసార్లు నేను క్రీజులోకి వచ్చినప్పుడు టెయిలెండర్లు ఉంటారు. అలాంటి సమయంలో ఆలోచన వేరేలా ఉంటుంది. బ్యాట్స్‌మన్‌తో కలిసి ఆడుతున్నప్పుడు ఆలోచనా విధానం మరోలా ఉంటుంది. స్వేచ్ఛగా ఆడేందుకు జట్టు యాజమాన్యం నాకు అవకాశమిచ్చింది" అని పంత్ చెప్పుకొచ్చాడు.

ప్రతిసారీ ఆటను ఆస్వాదిస్తా

ప్రతిసారీ ఆటను ఆస్వాదిస్తా

"బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారీ ఆటను ఆస్వాదిస్తా. గతంలో వెస్టిండీస్‌పై రెండు సార్లు 92 వద్ద ఔటయ్యా. ఇప్పుడు నన్ను అది కంగారు పెట్టింది. కానీ ఆ దశను త్వరగానే దాటేశా. అంతర్జాతీయ క్రికెట్‌లో సాధించే ప్రతి సెంచరీ ప్రత్యేకం. ఇప్పుడే నా కెరీర్‌ మొదలైంది. సెంచరీల గురించి నేను ఆలోచించను. జట్టు అవసరమేంటో ఆలోచిస్తా. క్రికెట్‌లో ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే గడ్డు దశలను దాటేస్తాం" అని పంత్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, January 4, 2019, 18:50 [IST]
Other articles published on Jan 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+