Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ నేర్పించడం వల్లే సాధ్యమైంది: పంత్

India vs Australia : Rishabh Pant Credits Dhoni For Everything | Oneindia Telugu
India vs Australia: Rishabh Pant pays rich tribute to MS Dhoni

పెర్త్‌: ఒకే టెస్ట్‌లో అత్యధిక క్యాచ్‌లతో ప్రపంచ రికార్డు సమం చేసిన భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ఆసీస్‌తో తొలి టెస్టులో ప్రపంచ రికార్డును సమం చేసిన భారత వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఆ ఘనత మహేంద్రసింగ్‌ ధోనీకి దక్కుతుందని అన్నాడు. ధోనీ దేశానికి లభించిన హీరో అని కొనియాడుతూ ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండడం ముఖ్యమని ధోనీ సలహా ఇచ్చేవాడని, ఆ సలహా పాటించడంవల్లే రికార్డును అందుకోగలిగానని పంత్‌ తెలిపాడు.

ఒత్తిడిని ఎలా అధిగమించాలో

ఒత్తిడిని ఎలా అధిగమించాలో

ఓ వ్యక్తిగా, క్రికెటర్‌గా ధోనీ నుంచి చాలా నేర్చుకున్నా. అతను నా చుట్టుపక్కల ఉన్నప్పుడు నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవాడ్ని. నాకు ఏదైనా సమస్య వస్తే నేరుగా మహీ దగ్గరకే వెళ్తా. సరైన పరిష్కారాన్ని చూపెడుతాడు. ఓ వికెట్ కీపర్‌గా, ఓ ఆటగాడిగా ఒత్తిడిని ఎలా అధిగమించాలో నేర్పించాడు. కీపర్‌ ప్రశాంతంగా ఉంటూ 100 శాతం కృషి చేయాలి. అడిలైడ్‌లో అది బాగా పని చేసింది అని పంత్ పేర్కొన్నాడు.

మైలురాయిని అందుకున్నందుకు సంతోషంగానే

మైలురాయిని అందుకున్నందుకు సంతోషంగానే

ప్రపంచ రికార్డును సమం చేస్తానని కలలో కూడా ఊహించలేదన్నాడు. మైలురాయిని అందుకున్నందుకు సంతోషంగానే ఉన్నా.. దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదన్నాడు.

ప్రపంచ రికార్డును కొల్లగొట్టి

ప్రపంచ రికార్డును కొల్లగొట్టి

21 ఏళ్ల పంత్‌ తొలి టెస్టులో మొత్తం 11 క్యాచ్‌లు పట్టి.. ఇంగ్లాండ్ ఆటగాడు జాక్‌ రసెల్‌ (జోహన్స్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై 1995లో), సఫారీ వీరుడు ఏబీ డివిలియర్స్‌ (జోహన్స్‌బర్గ్‌లో పాకిస్థాన్‌పై 2013) రికార్డును పంత్‌ సమం చేయడమేగాక, భారత తరఫున వృద్ధిమాన్‌ సాహా పేరిట ఉన్న ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌ల (10) రికార్డును కూడా అధిగమించిన విషయం తెలిసిందే.

Story first published: Wednesday, December 12, 2018, 9:06 [IST]
Other articles published on Dec 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+