పాంటింగ్ జోస్యం..ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ గెలుస్తుంది!!

సిడ్నీ: జనవరి 14 నుండి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సరీస్ ప్రారంభం కానుంది. మంగళవారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఈ వన్డే కోసం ఇరు జట్లు వాంఖేడేలో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఈ సరీస్‌పై ఇప్పటికే మాజీలు చాలామందే స్పందించారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ఆసీస్ 2-1తో సిరీస్ గెలుస్తుంది:
తాజాగా ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించిన పాంటింగ్ పలు విషయాలపై చర్చించాడు. ఈ సిరీస్‌లో ఎవరు గెలుస్తారని ఒక నెటిజన్ అడిగగా... 'తాజా టెస్టు సిరీస్‌ల విజయాలతో ఆస్ట్రేలియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. అయితే, గతేడాది ఐదు వన్డేల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఈ సారి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. ఆస్ట్రేలియా 2-1 తేడాతో విజయం సాధిస్తుందని భావిస్తున్నా' అని పాంటింగ్ సమాధానం ఇచ్చాడు.

రోహిత్ రికార్డులే తెలియజేస్తాయి:
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఐపీఎల్లో పని చేసిన అనుభవంతో అతనికి ఎంత రేటింగ్ ఇస్తారు అని ఓ నెటిజన్ పాంటింగ్‌ను ప్రశ్నించాడు. 'రోహిత్ శర్మకు ఒక బ్యాట్స్‌మన్‌గా, ఒక కెప్టెన్‌గా అత్యద్భుతమైన రేటింగ్ ఇస్తా. ఈ విషయాన్ని ఐపీఎల్లో అతను సాధించిన కెప్టెన్సీ రికార్డులే తెలియజేస్తాయి. రోహిత్ ఫామ్ అద్భుతం' అని పాంటింగ్ చెప్పాడు.

లబుషేన్‌పై ఆసక్తి నెలకొంది:
టెస్టు క్రికెటర్ లబుషేన్ ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తాడు అని అడగ్గా.. 'వచ్చే వన్డే సిరీస్‌లో అతను మిడిల్ ఆర్డర్‌లో అత్యుత్తమంగా ఆడతాడు. స్పిన్‌ను బాగా ఎదుర్కొంటాడు. వికెట్ల మధ్య బాగా పరిగెడతాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. అలాగే లెగ్ స్పిన్‌తో కూడా ఆకట్టుకుంటాడు. లబుషేన్ గురించి చాలా ఆసక్తి నెలకొంది' అని చెప్పుకొచ్చాడు.

సిరీస్ ఏదైనా గొప్పదే:
మరో మాజీ కెప్టెన్ స్టీవ్ వా మాట్లాడుతూ... 'భారత్-ఆస్ట్రేలియా తలపడే ఏ సిరీస్ అయినా ఆసక్తికరంగానే ఉంటుంది. సిరీస్ ఏదైనా గొప్పదే. ఇదో సంప్రదాయంగా మారింది. అప్పుడే 2020 చివర్లో పర్యటనపై ఆసక్తి పెరిగిపోతోంది. స్మిత్, వార్నర్‌తో ఆసీస్ జట్టు మరింత బలపడింది. కోహ్లీసేన అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. అందుకే ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుంది' అని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications