Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జడేజా ఎంపికపై రవిశాస్త్రికి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెస్కే

India vs Australia: Ravindra Jadeja was absolutely fit for tour - Chief selector MSK Prasad

మెల్‌బోర్న్‌: జట్టు కూర్పుపై మీడియా ప్రతినిధులతో రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా తయారైయ్యాయి. పెర్త్ ఓటమి అనంతరం కెప్టెన్ కోహ్లీ జడేజాను ఎంపిక చేసుకోకుండా తప్పు చేశామని ఒప్పుకున్నాడు. కానీ, దానిని సర్ది చెప్పుకోవడానికి గాయంతోనే రవీంద్ర జడేజాని వచ్చాడని టీమిండియా చీఫ్ కోచ్ అనడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మండిపడ్డారు. పెర్త్ వేదికగా గత వారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్ రవీంద్ర జడేజాకి ఎందుకు తుది జట్టులో అవకాశమివ్వలేదని రవిశాస్త్రిని ప్రశ్నించగా.. అతను ఫిట్‌గా లేడని సమాధానమిచ్చాడు.

ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారించుకున్నాకే

ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారించుకున్నాకే

గాయంతో బాధపడుతున్న జడేజాని సెలక్టర్లు ఎందుకు ఆస్ట్రేలియా పర్యటనకి ఎంపిక చేశారు..? అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ.. అతను ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారించుకున్నాకే జట్టులోకి ఎంపిక చేశామని తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు.

దాదాపు 60 ఓవర్లకిపైగా బౌలింగ్

దాదాపు 60 ఓవర్లకిపైగా బౌలింగ్

‘భారత్ జట్టు ఎంపికకి ముందు రోజు సాయంత్రం కచ్చితంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ రిపోర్టులని కమిటీ తెప్పించుకుంటుంది. అలానే ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టు ఎంపికకి ముందు కూడా రిపోర్టుల్ని పరిశీలించాం. అందులో రవీంద్ర జడేజా పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నట్లుగా తెలిసింది. అందుకే.. అతడ్ని జట్టులోకి ఎంపిక చేశాం. ఈ ఎంపిక తర్వాత.. జడేజా.. రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. అక్కడ దాదాపు 60 ఓవర్లకిపైగా బౌలింగ్ కూడా చేశాడు. ఒకవేళ అతను ఫిట్‌గా లేకపోతే.. ఎలా బౌలింగ్ చేస్తాడు..? కాబట్టి.. జడేజా ఫిట్‌గా లేడనే మాటల్లో నిజం లేదు' అని రవిశాస్త్రి వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు ఎమ్మెస్కే ప్రసాద్.

 మెల్‌బోర్న్ టెస్టుకు భారత్ జట్టు:

మెల్‌బోర్న్ టెస్టుకు భారత్ జట్టు:

మెల్‌బౌర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. 11 మందితో కూడిన తుది జట్టుని భారత్ సోమవారం ప్రకటించింది. అందులో జడేజాకి చోటు దక్కడం విశేషం.

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా

Story first published: Tuesday, December 25, 2018, 14:31 [IST]
Other articles published on Dec 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+