న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: జడేజా విధ్వంసం.. ధోనీ 8 ఏళ్ల రికార్డ్ బ్రేక్!!

India vs Australia: Ravindra Jadeja breaks MS Dhonis 8 year old record in T20Is
Ind vs Aus 2020,T20I : Ravindra Jadeja Breaks MS Dhoni's 8 Year Old Record In T20Is

కాన్‌బెర్రా: మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో తలపడిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 150/7కే పరిమితమైంది. దీంతో కోహ్లీసేన 11 పరుగుల తేడాతో విజయం సాధించి.. పొట్టి సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. యుజ్వేంద్ర చహల్‌ 3/25, టీ నటరాజన్‌ 3/30 విజృంభించడంతో కంగారూలు చేతులెత్తేశారు. అయితే ముందుగా భారత్ 161 పరుగులు చేయడానికి కారణం మాత్రం రవీంద్ర జడేజానే. కీలక సమయంలో బ్యాట్ జులిపించి జట్టును ఆదుకున్నాడు.

 ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లి:

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లి:

కాన్‌బెర్రా వేదికగానే ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో హార్దిక్ పాండ్యాతో కలిసి ఆరో వికెట్‌కి అజేయంగా 150 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన రవీంద్ర జడేజా.. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ చెలరేగాడు. ఒకానొక దశలో భారత్ 114 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడగా.. జడ్డూ (44 నాటౌట్: 23 బంతుల్లో 5x4, 1x6) ఆడుకోవడంతోనే 161 పరుగులు చేయగలిగింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన జడేజా 44 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 8 ఏళ్ల క్రితం నెలకొల్పిన అరుదైన రికార్డ్‌ని బ్రేక్ చేశాడు.

ధోనీ రికార్డ్ బ్రేక్:

ధోనీ రికార్డ్ బ్రేక్:

2012లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి దిగిన ఎంఎస్ ధోనీ.. 18 బంతుల్లో 38 పరుగులు బాదాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో నెం.7లో ఆడి.. అత్యధికంగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అప్పటినుంచి మహీ అగ్రస్థానంలో ఉన్నాడు. శుక్రవారం ఆ రికార్డ్‌ని జడేజా బద్దలు కొట్టాడు. జడేజా 23 బంతుల్లో 44 పరుగులు చేసి మహీ అరుదైన రికార్డును చేశాడు. గత ఆగస్టు నెలలో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే.

 రెగ్యులర్‌ ఆటగాడిగా:

రెగ్యులర్‌ ఆటగాడిగా:

రవీంద్ర జడేజా భారత జట్టు వన్డే, టీ20, టెస్టుల్లో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయాడు. బౌలింగ్‌లో కొన్నిసార్లు విఫలమైనా.. బ్యాటింగ్‌లో మాత్రం గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. మ్యాచ్‌ గమనానికి అనుగుణంగా భాగస్వామ్యల్ని నిర్మించడంతో పాటు స్లాగ్ ఓవర్లలో హిట్టింగ్ చేస్తూ జట్టును ఆడుకుంటున్నాడు. 2019 ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీతో కలిసి టీమిండియాను గెలిపించినంత పనిచేశాడు. కానీ ఒత్తిడిలో పెవిలియన్ చేరాడు. జడేజా భారత్ తరఫున 49 టెస్టులు, 168 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ బాదాడు.

టీ20 సిరీస్ నుంచి ఔట్:

టీ20 సిరీస్ నుంచి ఔట్:

తొలి టీ20 మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ (కంకషన్) ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా.. మిగితా రెండు మ్యాచ్‌ల‌కు దూరమయ్యాడు. జడేజా స్థానంలో ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌ని జట్టులోకి తీసుకున్నామని టీమిండియా మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం రెండో టీ20, మంగళవారం చివరి టీ20 మ్యాచులు జరగనున్నాయి. ఇక డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.

కోహ్లీకి మాత్రం రూల్స్ వర్తించవా?.. అడిగే ధైర్యం ఎవరికీ లేదు: సెహ్వాగ్ ఫైర్

Story first published: Saturday, December 5, 2020, 15:37 [IST]
Other articles published on Dec 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X