India vs Australia: కోచ్‌గా ఆర్ అశ్విన్.. కేఎల్ రాహుల్‌కి ట్రైనింగ్ (వీడియో)

సిడ్నీ: రెండు నెలల సుదీర్ఘ పర్యటన కోసం ఆస్ట్రేలియా వెళ్లిన భారత్ జట్టు నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడనుంది. గత వారమే అక్కడికి చేరుకున్న భారత ఆటగాళ్లు అందరూ 14 రోజుల పాటు నిబంధనలను పాటిస్తూ.. సాధన మొదలుపెట్టారు. గత రెండు నెలలు యూఏఈలో నెమ్మదైన పిచ్‌లపై ఆడిన భారత ఆటగాళ్లు.. ఆస్ట్రేలియా పిచ్‌లకు అలవాటు పడేలా శ్రమిస్తున్నారు. ఆసీస్ పిచ్‌లపై వచ్చే షార్ట్ బంతుల్ని ఎదుర్కొనే విధంగా నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతున్నారు.
టీమిండియా వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ బౌన్సర్లపై ప్రత్యేక దృష్టిసారించాడు. నెట్స్‌లో రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. అక్కడికి వెళ్లిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కాసేపు కోచ్ అవతారం ఎత్తాడు. 22 గజాలకు బదులుగా 18 గజాల నుంచి అశ్విన్ రాకెట్‌తో టెన్నిస్ బంతుల్ని సంధిస్తుండగా.. వాటిని పుల్‌షాట్స్‌తో రాహుల్ ఎదుర్కొంటున్నాడు. కొన్ని బంతుల్ని ఫుల్ చేసిన రాహుల్.. మరికొన్నింటిని అప్పర్ కట్ ఆడాడు. సాధారణంగా బ్యాటింగ్ కోచ్ ఈ తరహాలో బ్యాట్స్‌మెన్‌లకి శిక్షణ ఇస్తుంటాడు.
కేఎల్ రాహుల్ ప్రాక్టీస్‌కు సంబందించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి 'ఈ కొత్త ప్రయోగం ఎలా ఉంది' అని కాప్షన్ పెట్టింది. రాహుల్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన కేఎల్ రాహుల్ 670 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాహుల్ మాత్రమే కాదు బౌన్సర్ల వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా పైకి ఎగురుతున్న వీడియోను కూడా బీసీసీఐ తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి డే/నైట్ టెస్టు కోసం మొహమ్మద్ షమీ గులాబి బంతితో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. ఈ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. 'దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది. ఎంతో కాలం తర్వాత టీమిండియాతో కలిసి సాధన చేస్తున్నా' అని ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications