రాంచీలో ప్రాక్టీస్ షురూ: ధోని లేకుండా కోహ్లీ ఇలా (వీడియో)
హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు రాంచీలో గురువారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల అటగాళ్లు రాంచీ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో 1-1తో సిరిస్ సమమైంది.
రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‌సీఏ) స్టేడియంలో తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ సిరిస్‌లో తొలి టెస్టు జరిగిన పూణె స్టేడియం కూడా తొలిసారి అతిధ్యమిచ్చిన స్టేడియం కావడం విశేషం. తొలి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన 25వ స్టేడియంగా పూణె నిలవగా, రాంచీ స్టేడియం 26వది కావడం విశేషం.
ధోని లేకుండా రాంచీలో తొలి టెస్టు
రాంచీలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడకపోవడం అభిమానులకు వెలితిగా ఉంది. తొలిసారి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న రాంచీ మైదానంలో మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేశారు. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్టుపై దృష్టి సారించాడు. బ్యాటింగ్ ప్రాక్టీసుపై ప్రత్యేక దృష్టి పెట్టాడు.
మూడో టెస్టు కోసం ఐదో నెంబర్ పిచ్
ప్రాక్టీస్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు పిచ్‌ను పరిశీలించారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్టు కోసం మొత్తం నాలుగు పిచ్‌లను సిద్ధం చేసినట్లు క్యూరేటర్ ఎస్బీ సింగ్ తెలిపారు. కాగా, భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మూడో టెస్టు కోసం నెంబరు ఐదో పిచ్‌ను ఎంపిక చేశారు.
పిచ్‌ని పరిశీలించిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్
పిచ్‌ను పరిశీలించిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ మాట్లాడుతూ రాంచీ పిచ్‌ను పరిశీలించామని, మూడో టెస్టు విజయం కోసం ఏం చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఐదు రోజులు జరిగితే బాగుంటుంది
పిచ్ గురించి జేఎస్‌సీఏ సెక్రటరీ మాట్లాడుతూ గత రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఐదు రోజులకు బదులు నాలుగు రోజుల్లోనే ఫలితం తేలిందని.. రాంచీ పిచ్‌లో ఐదు రోజు వరకూ ఫలితం కోసం వేచి ఉండాల్సి ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications