రెండో వన్డే జరిగేనా!: ఈడెన్ మ్యాచ్‌కి వాన ముప్పు
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం జరగనున్న రెండో వన్డేకు వాన ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం చెన్నైలో జరిగిన తొలి వన్డేకి కూడా వర్షం అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే.

తొలి వన్డేకి కూడా వర్షం
తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ విరామంలో రెండు గంటలు వర్షం రావడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌ను 21 ఓవర్లకు కుదించి 164 పరుగులుగా లక్ష్యాన్ని కుదించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.

హెచ్చరించిన కోల్ కతా వాతావరణ శాఖ
దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 26 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. ఇక రెండో వన్డే జరిగే కోల్‌కతాలో ‘సెప్టెంబర్ 21న వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ నెలంతా ఇలాగే ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం వేళ తరుచూ జల్లులు పడతాయి. అయితే అవి మరీ ఎక్కువ సేపు ఉండవు' అని కోల్‌కతా వాతావరణ అధికారి గణేశ్ వెల్లడించారు.

పిచ్ పరిస్థితులను సమీక్షించిన గంగూలీ
వర్షం హెచ్చరికల నేపథ్యంలో ఈడెన్ పిచ్ పరిస్థితులను క్యాబ్ అధ్యక్షడు సౌరవ్ గంగూలీ సమీక్షించారు. పిచ్, ఔట్ ఫీల్డ్‌తో పాటు మైదానం మొత్తాన్ని కవర్లు కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు పిచ్ క్యూరేటర్ తెలిపారు. 2003, నవంబర్ 19 తర్వాత ఆసీస్ ఈడెన్‌లో వన్డే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ ఇలా
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పిచ్ ఉందని, మ్యాచ్ జరుగుతున్నప్పుడు వర్షం వస్తుందో లేదో చెప్పలేనని పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తెలిపారు. మరోవైపు రెండో వన్డే ఆడేందుకు ఇరు జట్లు సోమవారం కోల్‌కతా చేరుకున్నాయి. కోల్‌కతా చేరుకున్న ఆటగాళ్లు సోమవారం ప్రాక్టీస్ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications