
రానున్న 24-48 గంటల్లో భారీ వర్షాలు
రానున్న 24-48 గంటల్లో మాదిరి నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆదివారం బెంగళూరులో 54 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని పేర్కొంది. మరో రెండు రోజుల వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే పలు జాగ్రత్తలు
ఈ నేపథ్యంలో బెంగళూరు మైదానం చిత్తడిగా మారకుండా ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంత భారీవర్షం కురిసినా గంటలోపే మైదానాన్ని మ్యాచ్‌కు అనువుగా మార్చే అధునాతన సౌకర్యాలు చిన్నస్వామి స్టేడియంలో ఉన్నాయి. వర్షం తెరిపినివ్వగానే స్టేడియాన్ని అందుబాటులోకి తెస్తామని పిచ్ క్యురేటర్ తెలిపారు.

బెంగళూరు స్టేడియంలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ
ఇక్కడ ఏర్పాటు చేసిన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ సాయంతో మైదానం ఔట్ ఫీల్డ్‌ను తడిలేకుండా చేయగలమని అన్నారు. కోల్‌కతాలో జరిగిన రెండో వన్డేకు ముందు వర్షం కారణంగా ఇరుజట్లు ఇండోర్‌లో ప్రాక్టీస్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బెంగళూరులోనూ అదే పరిస్థితి పునరావృతం కానుంది.

తొలివన్డేను వర్షం కారణంగా 21 ఓవర్లకు
ఇక ఈసిరిస్‌లో భాగంగా చెన్నైలో జరిగిన తొలివన్డేను వర్షం కారణంగా 21 ఓవర్లకు కుదించగా.. రెండోవన్డేలోనూ వరుణుడు ప్రత్యక్షమవడంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేసి మళ్లీ కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది.


Click it and Unblock the Notifications











