ముచ్చెమటలు పట్టించిన భారత బౌలర్లు.. 191 పరుగులకే ఆసీస్ ఆలౌట్.. ఆధిక్యంలో భారత్!!

అడిలైడ్: అడిలైడ్‌లో జరుగుతున్న డే/నైట్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాను భారత బౌలర్లు ఆడుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా (2/52), రవిచంద్రన్ అశ్విన్ (4/55), ఉమేశ్ యాదవ్ (3/40)లు పదునైన బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించారు. భారత బౌలర్ల దెబ్బకు రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 72.1 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం లభించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ టిమ్ పైన్ (73 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. పైన్ 8వ వికెట్‌కు 28, 9వ వికెట్‌కు 28, 10వ వికెట్‌కు 24 పరుగులు జోడించి ఆసీస్ పరువు కాపాడాడు. మొత్తానికి తొలి టెస్టులో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది.
Story first published: Friday, December 18, 2020, 16:53 [IST]
Other articles published on Dec 18, 2020
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications