అశ్విన్ బౌలింగ్‌ను తీక్షణంగా గమనించారు: ఆసీస్ విజయం కారణం!
హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్‌లో 2004 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు భారత గడ్డపై ఆస్ట్రేలియా ఓ టెస్టు మ్యాచ్ గెలిచింది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
పూణె టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో ఆసీస్ విజయం వెనుక స్పిన్నర్ స్టీఫెన్ ఓకీఫ్ కీలక పాత్ర పోషించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే భారత పర్యటనకు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చాడు. పూణె టెస్టుకు ముందు కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

పూణె టెస్టు పరాజయం భారత్‌కు గట్టి షాక్
భారత్‌లోని పిచ్‌లు అనుకూలిస్తాయి కాబట్టే ఓకీఫ్‌కు ఆస్ట్రేలియా జట్టులో చోటు కల్పించారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పూణె టెస్టులో ఒక్కసారిగా ఓకీఫ్ రాణించడంతో హీరోగా మారిపోయాడు. స్వదేశంలో వరుసగా 20 టెస్టుల్లో ఓటమి అనేది ఎరుగకుండా దూసుకుపోతున్న భారత్‌కు పూణె టెస్టు పరాజయం గట్టి షాక్ అనే చెప్పాలి.

ఆస్ట్రేలియా అనుసరించిన వ్యూహమే ప్రధాన కారణం
టెస్టుల్లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న కోహ్లీ సేన ఇంతటి ఘోరంగా ఓటమి పాలవడం వెనుక ఆస్ట్రేలియా జట్టు అనుసరించిన వ్యూహమే ప్రధాన కారణమని తెలుస్తోంది. టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ బౌలర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆస్ట్రేలియా విజయానికి పరోక్షంగా దోహదపడ్డాడంట.

అశ్విన్ బౌలింగ్‌ను తీక్షణంగా గమనించిన ఆసీస్
అదెలాగంటారా? పూణె టెస్టుకు ముందు నెట్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఆస్ట్రేలియా జట్టు సభ్యులు, అదే సమయంలో టీమిండియా బ్యాట్స్‌మెన్లకు బౌలింగ్ చేస్తున్న అశ్విన్ బౌలింగ్‌ను తీక్షణంగా గమనించారట. గంటల తరబడి అశ్విన్ బౌలింగ్‌ను చూశారంట. దీంతో అటు బౌలింగ్ టెక్నిక్స్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లో కూడా భారత స్పిన్‌ను ఎలా ఎదుర్కోవాలో చర్చించారట.

కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన ఓకీఫ్
ఈ విషయాన్ని తొలి టెస్టు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆసిస్ బౌలర్ ఒకీఫ్ చెప్పాడు. పూణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన ఓకీఫ్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా 35 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. తద్వారా తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఈ క్రమంలో ఓకీఫ్ ఆస్ట్రేలియన్ మాజీ దిగ్గజాల సరసన చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications