పెర్త్‌లో టెస్టుకూ పృథ్వీ దూరమే!!

పెర్త్: విదేశీ గడ్డపై తొలి మ్యాచ్ ఆడేందుకు ఉవ్విళ్లూరుతూ.. కఠిన శ్రమతో సిద్ధమవుతోన్న తరుణంలో యువ క్రికెటర్ పృథ్వీ షాకు పెద్ద ఆటంకం ఎదురైంది. ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో టీమిండియా ఆడుతోన్న వార్మప్ మ్యాచ్‌లో గాయం తగలడంతో తొలి టెస్టుకు దూరమైయ్యాడు. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని భావించిన రవిశాస్త్రి కాలి గాయం నుంచి కోరుకున్నాడు. ప్రస్తుతం నడుస్తుండటంతో మరి కొద్ది రోజుల్లో ప్రాక్టీసులో పాల్గొని పెర్త్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆడతాడని తెలిపాడు.

31 పరుగుల తేడాతో విజయం
టీమిండియా.. ఆసీస్‌తో 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ల తత్తరపాటుతో తొలిరోజు ఆటలో డ్రాగా ముగించగలదా అనే సందేహాలు వినిపించాయి. దీంతో కలవరపాటుకు గురైన అభిమానులు రెండో రోజు నుంచి అనూహ్యంగా పుంజుకున్న టీమిండియా బౌలర్లను చూసి తేరుకున్నారు. ఇలా ఆసీస్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను విజయంతో ఆరంభించడం భారత్‌కు ఇదే మొదటిసారి కావడం ప్రత్యేకం.

టెస్టు సిరీస్‌కు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ
ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడటంతో కేఎల్ రాహుల్, మురళీ విజయ్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వీరిద్దరు తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఫర్వాలేదనిపించారు. పృథ్వీ గాయం నుంచి కోలుకుని పెర్త్‌లో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు.

రెండో టెస్టుకు కూడా
గాయం తగ్గకపోవడంతో రెండో టెస్టుకు కూడా ఈ యువ క్రికెటర్‌కు అవకాశం లభించలేదు. దీంతో తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగనుంది. పృథ్వీ క్రమంగా కోలుకుంటున్నాడని.. ప్రస్తుతం నడుస్తున్నాడని కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. మరో రెండు మూడు రోజుల్లో పరుగు పెడతాడన్నారు. మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ఈ ముంబై ఆటగాడు పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తొలి టెస్టులోనే సెంచరీ సాధించి
తొలి టెస్టులోనే సెంచరీ సాధించి సంచలన ఆటగాడిగా ముద్ర పడిన పృథ్వీ షా ఆసీస్ సిరీస్‌లో అద్భుతాలు చేస్తాడని ఆశించిన వారందరికీ నిరాశనే మిగిల్చాడు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో కాలికి అయిన గాయం నుంచి త్వరలోనే కోలుకుంటున్నాడని వైద్యులు చెప్తున్నారు. దీంతో మూడో టెస్టుకైనా అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications