ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: 'రెండో టెస్టు నుంచి పృథ్వీ షా ఔట్'

అడిలైడ్: టీమిండియా మేనేజ్‌మెంట్ ఆసీస్‌తో బరిలోకి దిగనున్న జట్టును ప్రకటించేసింది. ఇటీవల 12 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటిస్తోన్న టీమిండియా.. అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఇదే విధానాన్ని ఫాలో అయ్యింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఓపెనర్ రోహిత్ శర్మకు అవకాశం కల్పిస్తారని భావించిన అంచనాలు నిజమైయ్యాయి.

పృథ్వీ షాకు బదులుగా ఓపెనర్‌గా మురళీ విజయ్
రోహిత్‌కు చాలా కాలం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కింది. రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్‌లను మాత్రం దూరంగానే ఉంచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో అరంగ్రేటం చేసిన ఆంధ్రా బ్యాట్స్‌మెన్ హనుమ విహారీకి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. పేస్‌కు అనుకూలించే ఆసీస్ పిచ్‌ల నేపథ్యంలో జట్టులో ఒక స్పిన్నర్‌కు మాత్రమే అవకాశం కల్పించారు. అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్న కోహ్లి.. యువ స్పిన్నర్ కుల్దీప్‌ను పక్కనబెట్టాడు. పృథ్వీ షాకు బదులుగా ఓపెనర్‌గా మురళీ విజయ్‌కు చోటు దక్కించుకున్నాడు.

పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని తాజాగా
ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో సిడ్నీలో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో గాయపడిన పృథ్వీ షా.. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న మొదటి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. నవంబర్ 14న పెర్త్ వేదికగా జరగనున్న రెండో టెస్టు వరకైనా షా కోలుకుంటాడని, ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా భావించారు. అయితే రెండో టెస్టుకు అతడు ఆందుబాటులో ఉండడని, బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ వరకు పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని తాజాగా కోచ్ రవిశాస్త్రి తెలిపారు.

వారం రోజుల్లో పరుగెత్తే అవకాశం
‘ఫామ్‌లో ఉన్న పృథ్వీ గాయం కారణంగా సిరీస్‌కు దూరంగా ఉండటం బాధగా ఉంది. షా త్వరగా కోలుకుంటున్నాడు. ఇప్పటికే నడవడం మొదలు పెట్టాడు. వారం రోజుల్లో అతడు పరుగెత్తడం ప్రారంభించే అవకాశం ఉంది. అదే జరిగితే మూడో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు)కు అందుబాటులో ఉంటాడు' అని రవిశాస్త్రి అన్నారు.
టీమిండియా 12, ఆస్ట్రేలియా 11
అడిలైడ్ వేదికగా జరగనున్న మొదటి టెస్టు కోసం 12 మంది ఆటగాళ్ల పేర్లను కోహ్లీ వెల్లడించాడు. ఆరో స్థానం కోసం రోహిత్, విహారి మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కూడా పదకొండు మందితో కూడిన జట్టును ప్రకటించేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications