For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Border-Gavaskar Series: భారత్-ఆస్ట్రేలియా 5 టెస్టుల షెడ్యూల్ ఇదే

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ సిరీస్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ సారి ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అయిదు టెస్టులు ఆడనుంది. నవంబర్‌లో ప్రారంభం కానున్న ఈ సుదీర్ఘ సిరీస్‌లో ఓ డే/నైట్ టెస్టు కూడా ఉంది.

నవంబర్ 22 నుంచి జనవరి 7 వరకు టీమిండియా, ఆసీస్ అయిదు టెస్టులు ఆడనున్నాయి. పెర్త్ వేదికగా నవంబర్ 22న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మైదానంలో ఆడిన నాలుగింట్లో ఆస్ట్రేలియాదే విజయం. తొలి మ్యాచ్ 2018లో భారత్‌తోనే ఆసీస్ ఆడింది. ఇక డిసెంబర్ 6 నుంచి జరగనున్న పింక్ బాల్‌ టెస్టుకు అడిలైడ్ ఆతిథ్యం ఇవ్వనుంది.

India vs Australia Perth to host Border-Gavaskar series opener

గత పర్యటనలో అడిలైడ్ వేదికగానే భారత్-ఆసీస్ డే/నైట్ టెస్టు ఆడాయి. 2020-21 పర్యటనలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసింది. 36 పరుగులకే ఆలౌటైంది. ఈసారి అదే వేదికగా పింక్ బాల్ టెస్టు జరగనుంది. ఆస్ట్రేలియా కంచుకోట అయిన గబ్బాలో భారత్ మూడో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది.

మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్‌డే టెస్టు జరగనుంది. డిసెంబర్ 26 నుంచి ఈ టెస్టు మొదలవుతుంది. ఇక ఆఖరి టెస్టుకు సిడ్నీ ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 3 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియాతో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా పాకిస్థాన్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. నవంబర్ 2 నుంచి 18వరకు పాక్‌తో తలపడనుంది.

ఆస్ట్రేలియా vs భారత్ షెడ్యూల్
తొలి టెస్టు: నవంబర్ 22-26 (పెర్త్)
2వ టెస్టుణ : డిసెంబర్ 6-10 (అడిలైడ్) (D/N)
3వ టెస్టు: డిసెంబర్ 14-18 (గబ్బా, బ్రిస్బేన్)
4వ టెస్టు: డిసెంబర్ 26-30 (మెల్ బోర్న్)
5వ టెస్టు: జనవరి 3-7 (సిడ్నీ)

Story first published: Tuesday, March 26, 2024, 15:54 [IST]
Other articles published on Mar 26, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+