మయాంక్ అగర్వాల్ రూపంలో భారత్‌కు మంచి ఓపెనర్ దొరికాడా?


హైదరాబాద్: మయాంక్ అగర్వాల్ మెల్‌బోర్న్ టెస్టు ముందు వరకు క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం లేని పేరు. అయితే, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. గత పదేళ్లుగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.
గత రంజీ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించినా... ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించినప్పటికీ అంతగా పేరు సంపాదించలేకపోయాడు. అయితే, మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి (76, 42) 118 పరుగులు చేయడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

బాక్సింగ్ డే టెస్టుతో అరంగేట్రం
గతేడాది సెప్టెంబర్‌లో వెస్టిండిస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలుత చోటు దక్కలేదు. అయితే, తొలి రెండు టెస్టుల్లో భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్ ఘోరంగా విఫలం కావడం... పృథ్వీ షా గాయం కారణంగా సిరీస్‌కు దూరం కావడంతో సెలక్టర్లు మాయంక్ అగర్వాల్‌కు జట్టులో చోటు కల్పించారు.

తొలి టెస్ట్‌లోనే హాఫ్ సెంచరీ
ఈ సిరిస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ తొలి టెస్ట్‌లోనే హాఫ్ సెంచరీతో రాణించాడు. ముఖ్యంగా మెల్ బోర్న్ లాంటి పేస్ పిచ్‌లపై ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్న తీరు నిజంగా అద్భుతం. కొత్త బంతితో ఆసీస్ పేసర్లు తమ బౌన్సర్లతో హడలెత్తించిన క్రీజులో పాతుకుపోయాడు.

చారిత్రాత్మక విజయంలో భాగం
మొత్తం 161 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 76 పరుగులు చేశాడు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లోనూ 102 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల 42 పరుగులు చేసి భారత జట్టు సాధించిన చారిత్రాత్మక విజయంలో భాగమయ్యాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ మరింత దూకుడుగా సాగింది.

సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ
గురువారం సిడ్నీ వేదికగా ప్రారంభమైన చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ మరో హాఫ్ సెంచరీతో అలరించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమైనా మయాంక్ మాత్రం క్రీజ్‌లో పాతుకుపోయి 112 బంతుల్లో 72 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్ల విఫలం కావడంతో తనకు అందివచ్చిన అవకాశాలను మయాంక్ ఒడిసిపట్టుకున్నాడు.

మయాంక్ రూపంలో భారత్‌కు ఓ ఓపెనర్
దీంతో మయాంక్ అగర్వాల్ రూపంలో టీమిండియాకు మంచి టెస్టు ఓపెనర్ దొరికాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. రాబోయే సిరిస్‌ల్లో సైతం మయాంక్ ఇలాగే రాణిస్తే టెస్ట్ ఓపెనర్‌గా అతడి స్థానం పదిలమే. మరోవైపు వరుస వైఫల్యాల కారణంగా మురళీ విజయ్ టెస్ట్ కెరీర్ దాదాపుగా ముగిసినట్లేనని అంటున్నారు. ఇక, స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నా కేఎల్ రాహుల్ కెరీర్ కూడా ప్రమాదంలో పడినట్లే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications