Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డారెన్ లీమన్‌కు అస్వస్థత: స్మిత్‌ సేనకు కొత్త కోచ్‌‌గా సేకర్

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ కోచ్ డేవిడ్ సేకర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త బాధ్యతలు అప్పగించింది. ఈ ఏడాది మరోసారి వన్డే సిరిస్ కోసం భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టు కోచ్‌గా డేవిడ్ సేకర్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న డారెన్ లీమన్ అస్వస్థతతో బాధపడుతుండటమే ఇందుకు కారణం.

'భారత్‌లో ఆసీస్ వన్డే పర్యటనకు సంబంధించి డేవిడ్ సేకర్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నాం. ప్రస్తుతం ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న డేవిడ్ సేకర్ భారత పర్యటనలో ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తాడు. డారెన్ లీమన్ ఆరోగ్య సమస్యలు కారణంగా అతని స్థానంలో భారత్ పర్యటనకు సేకర్‌ను నియమిస్తున్నాం' అని సీఏ పేర్కొంది.

India vs Australia ODI series: David Saker to replace Darren Lehmann as coach

'గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డారెన్ లీమన్‌కు బ్లడ్ థిన్నింగ్ థెరఫీ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే లీమన్ స్థానంలో డేవిడ్ సేకర్‌ను ప్రధాన కోచ్‌గా భారత్‌లో జరిగే వన్డే సిరిస్ పర్యటనకు నియమించనున్నాం' అని సీఏ తెలిపింది.

ఇప్పటివరకు డారెన్ లీమన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయాల్ని సాధించింది. అయితే కొత్త కోచ్‌గా తన సత్తా నిరూపించుకునేందుకు సేకర్‌కు ఇదొక చక్కటి అవకాశమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ పర్యటనలో సేకర్ నేతృత్వంలోని ఆసీస్ రాణిస్తే, అతన్నే పూర్తిస్థాయి కోచ్‌గా చేసే అవకాశాలున్నాయి.

మరోవైపు తనకు లభించిన ఈ అవకాశం గొప్ప గౌరవమని డేవిడ్ సేకర్ అన్నారు. ఆస్ట్రేలియా జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేయడమే తన లక్ష్యమని చెప్పారు. నాలుగు టెస్టుల సిరీస్‌ ముగిసిన తర్వాత భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరిస్‌కి సంబంధించి తేదీలు, వేదికలు, షెడ్యూల్‌ను విడుదల చేస్తారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+