Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ రెండు వన్డేల వేదికల్లో ఎలాంటి మార్పుల్లేవు: తేల్చిచెప్పిన బీసీసీఐ

BCCI Says 'No Plans To Shift The Two Last ODI Matches From There' | Oneindia Telugu
India vs Australia: No plans to shift ODI matches from Mohali and Delhi - BCCI acting President

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు వన్డేల వేదికల్లో ఎలాంటి మార్పుల్లేవని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షడు సీకే ఖన్నా స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం మొహాలి, ఢిల్లీ మైదానాలు మ్యాచ్‌లకు యథావిధిగా ఆతిథ్యం ఇస్తాయని ఆయన వెల్లడించారు.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ర్టాల్లో అలజడి వాతావరణం అలుముకున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మొహాలి, ఢిల్లీ మ్యాచ్‌ వేదికలు మారతాయని వార్తలు వచ్చాయి.

మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేకుంటే ఒక మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం ముందుకొచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో వన్డే వేదికల మార్పుపై వస్తున్న వార్తలను బీసీసీఐ తాత్కాలిక ఉపాధ్యక్షుడు సీకే ఖన్నా తోసిపుచ్చారు.

"కేటాయించిన వేదికల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. షెడ్యూలు ప్రకారమే మొహాలి, ఢిల్లీలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేకుంటే బీసీసీఐ ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటుంది. సౌరాష్ట్ర ముందుకు రావడం సంతోషం. ప్రస్తుతానికి ఆ అవసరం లేదు" అని ఖన్నా వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మొహాలీలో నాలుగో వన్డే, మార్చి 13న ఢిల్లీలో ఐదో వన్డే జరగనుంది,

Story first published: Saturday, March 2, 2019, 11:06 [IST]
Other articles published on Mar 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+