బీసీసీఐ వేడుకకు గైర్హాజరు: రాంచీ పిచ్‌ను పరిశీలించిన ధోని
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బుధవారం రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‌సీఏ) స్టేడియాన్ని సందర్శించాడు. అనంతరం పిచ్‌ని పరిశీలించాడు. ఆ తర్వాత క్యూరేటర్‌తో ఎస్బీ సింగ్‌తో కాసేపు పిచ్ గురించి మాట్లాడారు.
నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 16 నుంచి రాంచీలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాంచీ పిచ్‌ని ధోని ఆకస్మికంగా సందర్సించినట్లు జార్ఖండ్ స్టేడియం నిర్వాహకులు తెలిపారు.

బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమానికి గైర్హాజరు
బుధవారం రాత్రి బెంగుళూరులోని రిట్జ్ హోటల్‌లో జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమానికి ధోని హాజరుకావాల్సి ఉండగా కోల్‌కతా నుంచి బయల్దేరి రాంచీలోని ధోని నివాసానికి వెళ్లారు. అనంతరం జేఎస్‌సీఏ స్టేడియాన్ని సందర్శించారు.

జార్ఖండ్ స్టేడియానికి వెళ్లి పిచ్‌ను పరిశీలించిన ధోని
అయితే ధోని ఆకస్మికంగా జార్ఖండ్ స్టేడియానికి వెళ్లి పిచ్‌ను పరిశీలించడం వెనుక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా పిచ్ క్యూరేటర్ ఎస్బీ సింగ్ మీడియాతో మాట్లాడారు. ధోని పిచ్‌ని పరిశీలించారే తప్ప, మూడో టెస్టు కోసం తయారు చేసే పిచ్ కోసం ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదని అన్నారు.

స్టేడియంలోని ఫిట్‌నెస్, జిమ్ సెంటర్లలో గడిపారు
స్టేడియంలోని ఫిట్‌నెస్, జిమ్ సెంటర్లలో ఎక్కువ సమయం గడిపారని చెప్పారు. 'ఈరోజులో ఎటువంటి తేడా లేదు. పిచ్‌ని పరిశీలించిన తర్వాత మా ఇద్దరి మధ్య సాధారణ సంభాషణ మాత్రమే కొనసాగింది. గత నాలుగు సంత్సరాల నుంచి ఆయన పిచ్ తయారీ విధానంలో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు' అని చెప్పారు.

మూడో టెస్టు కోసం మూడు వికెట్లను రూపొందించిన జేఎస్‌సీఏ
జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మూడో టెస్టు కోసం మూడు వికెట్లను రూపొందించిన ఆయన అన్నారు. ఇక్కడు రూపొందించిన పిచ్ నెంబర్ నాలుగు, ఐదు, ఏడు అన్నీ కూడా బౌలర్లకు, బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా సమతూకంగా ఉండే పిచ్‌లనే సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications