Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వికెట్ల మధ్య పరిగెత్తడంలో ధోని అరుదైన రికార్డు (వీడియో)

హైదరాబాద్: గువహటి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుని నెలకొల్పాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా గత మంగళవారం భారత్-ఆసీస్ జట్ల మధ్య రెండో టీ20 జరిగిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో ధోని రెండో ర‌న్ కోసం గంట‌కు 31 కిలోమీటర్ల వేగంతో ప‌రిగెత్తాడు. ధోనీ ర‌న్నింగ్ విశ్లేష‌ణ వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 'ధోనీ ర‌న్నింగ్‌ రికార్డును ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేరు' అంటూ కామెంట్ కూడా పోస్టు చేసింది.

India vs Australia: MS Dhoni sets unique record during the 2nd T20 game in Guwahati

శ్రీలంకతో వన్డే, టీ20 సిరిస్‌కు ముందు ఆగ‌స్టులో నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో ఫిట్ నెస్ పరీక్షకు హాజరైన ధోని 20 మీట‌ర్ల రేస్‌ను 2.91 సెక‌న్ల‌లో పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా స్టార్ స్పోర్ట్స్ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. 'ధోనీ బుల్లెట్ ట్రెయిన్ కంటే ఫాస్ట్‌', 'ధోనీ రికార్డు సృష్టిస్తే అంతే ఇక‌.. దాన్ని ఎవ‌రూ దాట‌లేరు' అభిమానులు కామెంట్స్ పెట్టారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+