Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని ఖాతాలో అరుదైన ఘనత: సచిన్, రోహిత్, కోహ్లీ సరసన

MS Dhoni On Verge Of Joining Sachin Tendulkar,Virat Kohli In Elite List | Oneindia Telugu
India vs Australia: MS Dhoni on verge of joining Sachin Tendulkar, Virat Kohli in elite list

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో ధోని (87 నాటౌట్‌) నిలవడంతో ఆసీస్ గడ్డ మీద భారత క్రికెట్ జట్టు తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను గెలుపొందింది.

మూడు వన్డేల సిరిస్‌లో ధోని వరుసగా 51, 55*, 87* పరుగులతో రాణించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ధోని ఆసీస్ గడ్డపై వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్న నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా ధోని గుర్తింపు పొందాడు. 34 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ధోని ఈ ఘనతను అందుకున్నాడు.

ఎలైట్ జాబితాలోకి ధోని

ఎలైట్ జాబితాలోకి ధోని

తద్వారా ఈ ఘనతను అందుకున్న సచిన్‌ టెండూల్కర్‌, విరాట్ కోహ్లి, రోహిత్‌ శర్మల సరసన చేరాడు. మూడో వన్డేలో శిఖర్ ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని తొలి బంతికే వెనుదిరిగాల్సి ఉన్నా.. అదృష్టం కలిసొచ్చింది. ధోని ఇచ్చిన సునాయస క్యాచ్‌ను గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ జారవిడిచాడు.

తనదైన శైలిలో విజృంభించిన ధోని

తనదైన శైలిలో విజృంభించిన ధోని

ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ధోని తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. ఒక్క ఫార్మాట్లో కూడా సిరీస్‌ కోల్పోకుండా ఆసీస్‌ పర్యటనను ముగించిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనత సాధించింది.

మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు‌ని అందుకున్న ధోని

మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు‌ని అందుకున్న ధోని

మూడు వన్డేల్లో కలిపి ధోనీ 73.10 స్ట్రైక్ రేట్‌తో 193 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు‌ని సొంతం చేసుకున్నాడు. ఇక 2011 అనంతరం ధోని ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తన కెరీర్‌లో మహీకి ఇది ఏడో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కావడం విశేషం.

గవాస్కర్ రికార్డు బద్దలు

గవాస్కర్ రికార్డు బద్దలు

ఈ సిరిస్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' గెలవడంతో ధోని ఖాతాలో అరుదైన రికార్డు నమోదైంది. అత్యంత పెద్ద వయసు (37 ఏళ్ల 195 రోజులు)లో ఈ అవార్డు గెలిచిన భారత ఆటగాడు ధోనీయే. గావస్కర్‌ (37 ఏళ్ల 191 రోజులు, 1987లో శ్రీలంకపై) రికార్డును ధోని బద్దలు కొట్టాడు.

Story first published: Saturday, January 19, 2019, 10:43 [IST]
Other articles published on Jan 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+