మూడింటిలో ధోని: ఎలైట్ జాబితాలోకి ధోని-జాదవ్ భాగస్వామ్యం


హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రపంచలోనే బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది పేలవ ప్రదర్శన కారణంగా ధోని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక, ధోని పని అయిపోయిందని, రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని పలువురు మాజీ క్రికెటర్లు బాహాటంగానే విమర్శించారు.
అయితే.. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్‌తో ధోని మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో సైతం పాత ధోనీని అభిమానులకు గుర్తు చేస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. శనివారం హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో మరోసారి ధోని చెలరేగాడు.

ఐదో వికెట్‌కు 141 పరుగులు
ఐదో వికెట్‌కు 141 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కేదార్ జాదవ్ (87 బంతుల్లో 81 నాటౌట్), ధోనీ (72 బంతుల్లో 59 నాటౌట్) జట్టుని విజయతీరాలకు చేర్చాడు. వీరిద్దరూ ఎంతో సమన్వయంతో ఆడటం వల్ల 236 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో భారత్ ఛేదించడం విశేషం.

1-0 ఆధిక్యంలో నిలిచిన భారత్
దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ధోని-జాదవ్‌ల జోడి తొలిసారి ఆస్ట్రేలియాపై 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఇది రెండోసారి. గత, జనవరి 18న ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ధోనీ, జాదవ్ నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించి నాటౌట్‌గా నిలిచారు.

7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం
ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక, హైదారాబాద్ వన్డేలో ధోనీ-జాదవ్‌ల జోడి నెలకొల్పిన 141 పరుగుల భాగస్వామ్యం స్వదేశంలో ఆస్ట్రేలియాపై ఐదో వికెట్‌కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. కాగా, ఆస్ట్రేలియాపై టీమిండియా ఐదో వికెట్‌కు నెలకొల్పిన ఐదు అత్యుత్తమ భాగస్వామ్యాల్లో ధోని ఉన్నాడు.

ధోనిదే అగ్రస్థానం
ఈ జాబితాలో ధోనిదే అగ్రస్థానం కావడం విశేషం. 2013 నవంబర్ 2న బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, ధోనీ ఐదో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డేల్లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై ఐదో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇప్పుడు రెండో అత్యుత్తమ భాగస్వామ్యంలోనూ ధోని పాలుపంచుకున్నాడు.

వన్డేల్లో ఆస్ట్రేలియాపై ఐదో వికెట్‌కు అత్యుత్తమ భారత భాగస్వామ్యాలు:
* ధోనీ - రోహిత్ శర్మ: 167 పరుగులు (2013 నవంబర్ 2 - బెంగళూరు)
* ధోనీ - కేదార్ జాదవ్: 141 పరుగులు (2018 మార్చి 2 - హైదరాబాద్)
* టెండూల్కర్ - సురేశ్ రైనా: 137 పరుగులు (2009 నవంబర్ 5 - హైదరాబాద్)
* ధోనీ - సురేశ్ రైనా: 136 పరుగులు (2009 అక్టోబర్ 28 - నాగ్‌పూర్)
* అజయ్ జడేజా - కనిత్కర్: 121 పరుగులు (1998 ఏప్రిల్ 1 - కొచ్చి)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications