Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డేల్లో నాలుగో స్థానానికి ధోనీనే సరిపోతాడు: రోహిత్ కీలక వ్యాఖ్యలు

India vs Australia: MS Dhoni is Indias ideal No.4, says Rohit Sharma

హైదరాబాద్: వన్డేల్లో నాలుగో స్థానానికి ధోనీనే సరిపోతాడని టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. గత కొంతకాలంగా ఈ స్థానంలో అంబటి రాయుడు ఆడుతుండటం, అతడికి కెప్టెన్ కోహ్లీ మద్దతుగా నిలుస్తోన్న తరుణంలో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

సిడ్నీ వేదికగా శనివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ "ధోని నాలుగో స్థానంలో రావడం జట్టుకు మేలు చేస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఆ స్థానంలో రాణిస్తున్న రాయుడు ఉన్నాడు. అయితే జట్టు కూర్పు విషయంలో తుది నిర్ణయం మాత్రం కెప్టెన్‌, కోచ్‌లదే" అని రోహిత్‌ తెలిపాడు.

ధోని నెమ్మదిగా ఆడాడన్న విమర్శలపై

ధోని నెమ్మదిగా ఆడాడన్న విమర్శలపై

ఇక, సిడ్నీ వన్డేలో ధోని మరీ నెమ్మదిగా ఆడాడన్న విమర్శలపై కూడా రోహిత్ శర్మ స్పందించాడు. "ధోని తన కెరీర్లో దాదాపు 90 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. తొలి వన్డేలో అతను బ్యాటింగ్‌కు వచ్చేటప్పటికే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పైగా ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో 100 భాగస్వామ్యం నమోదు చేయడం సులభం కాదు" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

నేను కూడా వేగంగా పరుగులు చేయలేకపోయా

నేను కూడా వేగంగా పరుగులు చేయలేకపోయా

"క్రీజులో కుదురుకునేందుకు సమయం కావాలి. నేను కూడా వేగంగా పరుగులు చేయలేకపోయా. అప్పుడే మరో వికెట్‌ పడి ఉంటే పరిస్థితి ఘోరంగా ఉండేదని జాగ్రత్తగా ఆడాం. ధోని కొన్నేళ్లుగా జట్టు అవసరాలకు తగ్గట్లు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ధోని ఔట్‌ కాగానే మ్యాచ్‌ కఠినంగా మారుతోందని అనిపించింది" అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

జడేజా కీలక ఇన్నింగ్స్‌ ఆడతాడేమో అని అనుకున్నా

జడేజా కీలక ఇన్నింగ్స్‌ ఆడతాడేమో అని అనుకున్నా

"రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్‌ ఆడతాడేమో అని అనుకున్నా. కానీ సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా ఉన్నపుడు ఏ ఆటగాడైనా ఒత్తిడికి గురి కావడం మామూలే" అని రోహిత్‌ అన్నాడు. 289 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న సమయంలో రోహిత్ శర్మ ఒంటరి పోరాటం చేసిన సంగతి తెలిసిందే.

వన్డేల్లో 22వ సెంచరీని నమోదు చేసిన రోహిత్

వన్డేల్లో 22వ సెంచరీని నమోదు చేసిన రోహిత్

రోహిత్‌ శర్మ (133; 129 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సులు) అద్భుత పోరాటంతో రేసులోకి తీసుకొచ్చినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడంతో టీమిండియా ఓటమి పాలైంది. ధోనీతో కలిసి నాలుగో వికెట్‌కు 137 పరుగులు జోడించిన రోహిత్ శర్మ చివరి వరకు క్రీజులో ఉండి విజయం కోసం పోరాడాడు. ఓ ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ... ఆచితూచి ఆడుతూ పరుగుల వరద పారించాడు. వరుసగా పదో సిరీస్‌లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ వన్డేల్లో 22వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

1
43627
Story first published: Sunday, January 13, 2019, 12:25 [IST]
Other articles published on Jan 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+