న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెట్స్‌లో ధోనికి గాయం: హైదరాబాద్ వన్డేకి దూరమేనా!

India Vs Australia 1st ODI : MS Dhoni Injures Forearm On The Eve Of 1st ODI | Oneindia Telugu
India Vs Australia: MS Dhoni Injures Forearm On The Eve Of 1st ODI

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటను ప్రత్యక్షంగా వీక్షించాలనుకున్న హైదరాబాద్ వాసులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్ వేదికగా శనివారం తొలి వన్డే ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు టీ20ల సిరిస్‌ను చేజార్చుకున్న కోహ్లీసేన వన్డే సిరిస్‌ గెలుపే లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించింది.

<strong>పృథ్వీ షా ఈజ్ బ్యాక్: ఒంటి చేత్తో సిక్స్ బాదాడు (వీడియో)</strong>పృథ్వీ షా ఈజ్ బ్యాక్: ఒంటి చేత్తో సిక్స్ బాదాడు (వీడియో)

ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో

ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో

ఇందులో భాగంగా తొలి వన్డే సిరిస్ కోసం భారత క్రికెట్ జట్టు ఉప్పల్ మైదానంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. తొలి వన్డేలో విజయం సాధించి వన్డే సిరిస్‌ను గెలుపుతో ప్రారంభించాలనే తలంపుతో కోహ్లీసేన ఉంది. ఈ క్రమంలో ఆసీస్‌తో జరగబోయే తొలి వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ధోని గాయపడ్డాడు.

రాఘవేంద్ర విసిరిన బంతి

రాఘవేంద్ర విసిరిన బంతి

నెట్స్‌లో ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో సపోర్ట్ స్టాఫ్ సభ్యుడైన రాఘవేంద్ర విసిరిన బంతి ధోని కుడి చేతికి బలంగా తాకింది. అనంతరం వెంటనే ధోని విపరీతమైన నొప్పితో విలవిల్లాడు. అప్పటికే చాలా సేపటి నుంచి నెట్స్‌ లో ప్రాక్టీస్ చేస్తున్న ధోని.... గాయపడిన వెంటనే ముందు జాగ్రత్తగా నెట్స్ నుంచి వెళ్లిపోయాడు.

ధోని గాయం తీవ్రతపై రాని స్పష్టత

ధోని గాయం తీవ్రతపై రాని స్పష్టత

అయితే, ధోనికి అయిన గాయం తీవ్రత మాత్రం తెలియరాలేదు. తొలి వన్డేలో ధోని ఆడతాడా లేదా అన్నది శుక్రవారం సాయంత్రంలోగా తేలనుంది. ఒకవేళ తొలి వన్డేకి ధోని దూరమైతే అతడి స్థానంలో రిషబ్ పంత్‌‌కు తుది జట్టులో చోటు కల్పించాలనే ఆలోచనలో జట్టు మేనేజ్‌మెంట్ ఉంది. టీ20 సిరిస్‌ను 0-2తో చేజార్చుకోవడంతో వన్డే సిరిస్‌ను విజయంతో ప్రారంభించాలని కోహ్లీసేన భావిస్తోంది.

Story first published: Friday, March 1, 2019, 15:30 [IST]
Other articles published on Mar 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X