Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ధోని మా గైడింగ్‌ లైట్‌... వరల్డ్ కప్‌లో కీలకపాత్ర పోషిస్తాడు'

India vs Australia: MS Dhoni guiding light for India, says Rohit Sharma

హైదరాబాద్: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలక పాత్ర పోషిస్తాడని భారత జట్టు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డాడు. ధోని జట్టులో ఉంటే ఆటగాళ్లకు భరోసాగా ఉంటుందని, ప్రశాంత చిత్తంతో పనిచేసుకుపోయే ధోని తమ 'గైడింగ్‌ లైట్‌'గా రోహిత్ శర్మ అభివర్ణించాడు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు గురువారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ "కొన్నేళ్లుగా ధోని ప్రభావాన్ని డ్రెస్సింగ్‌ రూమ్‌లో, మైదానంలో చూస్తూనే ఉన్నాం. అతను వికెట్ల వెనకాల ఉంటే కెప్టెన్‌కు ధైర్యంగా ఉంటుంది. అలాగే తన సలహాలతో యువ ఆటగాళ్లకు ఎంతో తోడ్పడతాడు" అని అన్నాడు.

"మహీ గొప్ప ఫినిషర్. అతని సామర్థ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను జట్టులో ఉండటం చాలా అవసరం. కెప్టెన్‌గా ధోనీ జట్టును చాలా ఏళ్లు నడిపించాడు. ఆ హోదా నుంచి తప్పుకున్నాక కూడా అతడి విలువైన సలహాలు జట్టుకు ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ బలంగా ఉంటుంది" అని రోహిత్ చెప్పాడు.

"స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ విజయవంతమవడంలో ధోనీ పాత్ర ఎంతో ఉంది. లోయర్‌ఆర్డర్ బ్యాటింగ్ చేయాలంటే ధోనీ తరువాతే ఎవరైనా. మహీ ఫినిషింగ్ నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా ధోనీ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు" అని రోహిత్‌ వివరించాడు.

Story first published: Friday, January 11, 2019, 13:45 [IST]
Other articles published on Jan 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+