For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: 350 సిక్సులు బాదిన తొలి భారత క్రికెటర్‌గా ధోని రికార్డు

India vs Australia 2019 : Dhoni Becomes The First Indian To Knock 350 Sixes In International Cricket
India vs Australia: MS Dhoni becomes the first Indian to hit 350 sixes in international cricket

హైదరాబాద్: బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. భారత్ తరుపున మూడు ఫార్మాట్లలో 350 సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా ధోని అరుదైన గుర్తింపు పొందాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ధోని 23 బంతుల్లో 3 సిక్సుల సాయంతో 40 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ భారీ స్కోరు చేయడంతో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధోనీ ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. డీ ఆర్సీ షార్ట్ వేసిన తర్వాతి ఓవర్లో మోకాళ్ల మీద నిలబడి మరీ ధోని భారీ సిక్స్ బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్స్‌లు కొట్టిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు.

పవర్‌ప్లేలో 53 పరుగులు రాబట్టిన టీమిండియా

పవర్‌ప్లేలో 53 పరుగులు రాబట్టిన టీమిండియా

తొలి నాలుగు ఓవర్లలో మూడు ఫోర్లే వచ్చినా.. ఐదో ఓవర్‌లో రాహుల్ జోరు చూపెట్టాడు. రిచర్డ్‌సన్ వరుస బంతులను రెండు సిక్సర్లుగా మిలిచాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కమిన్స్‌ను కూడా మిడ్‌వికెట్, బ్యాక్‌వర్డ్ స్కేర్ లెగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో పవర్‌ప్లేలో టీమిండియా 53 పరుగులు చేసింది. ఆ తర్వాత కౌల్టర్-నైల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన రాహుల్ నేరుగా థర్డ్‌మ్యాన్‌లో రిచర్డ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫలితంగా తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచిన ధోని

మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచిన ధోని

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.... మరో ఓపెనర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, 10వ ఓవర్‌లో ధావన్... 11వ ఓవర్‌లో రిషబ్ (1) చెత్త షాట్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. కేవలం 10 బంతుల తేడాలో ఈ ఇద్దరూ ఔట్‌కావడంతో భారత్ 74 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కోహ్లీ ఆసీస్ బౌలర్లను చితక్కొట్టారు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి టీ20లో నెమ్మదిగా ఆడాడని విమర్శలు ఎదుర్కొంటున్న ధోని షార్ట్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచాడు.

29 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ

29 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ

వేగంగా స్ట్రయిక్‌ను రొటేట్ చేసిన కోహ్లీ 16వ ఓవర్లో వరుసగా 6, 6, 6తో 22 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో 20వ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 18వ ఓవర్‌లో ధోనీ.. 6, 6, 4తో 19 పరుగులు రాబట్టాడు. 19వ ఓవర్‌లో కోహ్లీ సిక్స్, ఫోర్ బాదినా.. ఆఖరి ఓవర్‌లో ధోని ఔటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 50 బంతుల్లోనే 100 పరుగులు జతయ్యాయి. తర్వాత కార్తీక్ (8 నాటౌట్) రెండు ఫోర్లు బాదగా.. ఆఖరి బంతిని కోహ్లీ సూపర్ సిక్స్‌తో ముగించాడు. దీంతో చివరి 9 ఓవర్లలో 116 పరుగులు వచ్చాయి.

మ్యాక్స్‌వెల్ సెంచరీతో ఆసీస్ విజయం

మ్యాక్స్‌వెల్ సెంచరీతో ఆసీస్ విజయం

అనంతరం టీమిండియా నిర్ధేశించిన 191 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (113నాటౌట్‌; 55బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సులు) సెంచరీతో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో రెండు టీ20ల సిరిస్‌ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో 11 ఏళ్ల తర్వాత భారత్‌పై టీ20 సిరిస్‌ను గెలిచినట్లు అయింది. 2008 మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 మ్యాచ్ ఓడిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఇప్పటి దాకా ఓడిపోలేదు. చివరిగా 2015లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోల్పోయింది.

Story first published: Thursday, February 28, 2019, 13:52 [IST]
Other articles published on Feb 28, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+