
స్టార్క్ డకౌట్:
టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 32 ఓవర్ మూడో బంతికి మార్నస్ లబూషేన్ (54) పెవిలియన్ చేరాడు. క్రీజులో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని కాకుండా స్టార్క్‌ను ఐదవ స్థానంలో బ్యాటింగ్‌కు దింపాడు. అయితే స్టార్క్ కేవలం మూడు బంతులే ఆడి డకౌట్ అయ్యాడు. జడేజా వేసిన 32 ఓవర్ చివరి బంతికి స్టార్క్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడగా.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ యుజువేంద్ర చహల్ క్యాచ్ పట్టాడు. దీంతో స్టార్క్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

ట్రోల్ చేసిన భార్య:
టీమిండియా ముందు భారీ లక్ష్యం ఉంచాలనే ఉద్దేశంతోనే స్టార్క్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కెప్టెన్ మార్చాడు. అయితే ఆసీస్ కెప్టెన్ వ్యూహం మాత్రం ఫలించలేదు. స్టార్క్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఆసీస్ మేనేజ్మెంట్ నిరాశచెందింది. స్టార్క్ ఔటైన తీరును సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్ చేసారు. స్టార్క్ భార్య, ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు అలీసా హేలీ కూడా ట్రోల్ చేసింది. తలను చేతితో కొట్టుకుంటున్న ఓ మహిళా ఎమోజీ పోస్ట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ అయింది.

బ్యాటింగ్ ఎలా చేయోలా నేర్పించండి:
అలీసా హేలీ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'బ్యాటింగ్ ఎలా చేయోలా నేర్పించండి' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'స్టార్క్ బ్యాటింగ్ చూసి నవ్వు ఆపులేకపోతున్నాం' అని మరొకరు ట్వీటారు. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో అలీసా హేలీ వికెట్ కీపర్‌గా, బ్యాట్‌వుమన్‌గా ఎన్నో ఘనతలు సాధించింది. ఇక బెంగళూరు వన్డేలో స్టార్క్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 9 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు.
టీమిండియా ఘన విజయం:
ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మూడవ వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్ (131) రాణించడంతో తొలుత ఆసీస్ 286 పరుగులు చేసింది. షమీ (4/63), జడేజా (2/44) రాణించారు. అనంతరం రోహిత్ (119), కోహ్లీ (89), శ్రేయస్ (44*) చెలరేగడంతో 47.3 ఓవర్లలోనే టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది.


Click it and Unblock the Notifications
