For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌తో 3rd T20I: స్టాన్‌లేక్‌ స్థానంలో మిచెల్ స్టార్క్‌

India vs Australia 3rd T20I : Mitchell Starc Replaces Billy Stanlake | Oneindia Telugu
India vs Australia: Mitchell Starc replaces injured Billy Stanlake for 3rd T20I

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగే మూడో టీ20కి పేసర్ మిచెల్ స్టార్క్‌ను ఎంపిక చేశారు. శుక్రవారం వార్మప్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా బిల్లీ స్టాన్‌లేక్‌కు చీలమండ గాయం కావడంతో అతడు సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో మిచెల్‌ స్టార్క్‌ బరిలోకి దిగుతాడని ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ తెలిపాడు.

 గాయం కారణంగా బిల్లీ స్టాన్‌లేక్‌ మ్యాచ్‌ మొత్తానికి దూరం

గాయం కారణంగా బిల్లీ స్టాన్‌లేక్‌ మ్యాచ్‌ మొత్తానికి దూరం

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టీ20 ఆరంభానికి ముందు పేసర్ బిల్లీ స్టాన్‌లేక్‌ గాయం కారణంగా మ్యాచ్‌ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో రెండో టీ20కి అతడి స్థానంలో నాథన్ కౌల్టర్ నైల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక, సిరిస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడంతో స్టాన్‌లేక్ స్థానాన్ని మిచెల్ స్టార్క్‌తో భర్తీ చేశారు.

ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఆస్ట్రేలియా

ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఆస్ట్రేలియా

మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. మెల్‌బోర్న్‌లో శుక్రవారం రెండో టీ20కి వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే సిరీస్‌ను ఫలితాన్ని నిర్ణయించనున్న చివరి టీ20కి కీలక బౌలర్‌ స్టార్క్‌ అందుబాటులో ఉంటాడని ఫించ్‌ పేర్కొన్నాడు.

ప్రత్యర్థిని జట్టుని సులభంగా కట్టడి చేయగలడు

ప్రత్యర్థిని జట్టుని సులభంగా కట్టడి చేయగలడు

"ఎంతో అనుభవం ఉన్న స్టార్క్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అద్భుతంగా రాణించగలడు. ఒక్కసారి లయ అందుకుంటే చాలు అతను సులభంగా ప్రత్యర్థిని కట్టడి చేయగలడు" అని ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న స్టార్క్‌ శనివారం జట్టుతో కలిసే అవకాశం ఉంది.

చివరిసారిగా 2016 సెప్టెంబర్‌లో శ్రీలంకతో జరిగిన టీ20లో

చివరిసారిగా 2016 సెప్టెంబర్‌లో శ్రీలంకతో జరిగిన టీ20లో

ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో బరిలోకి దిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది. మిచెల్ స్టార్క్ చివరిసారిగా 2016 సెప్టెంబర్‌లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు. భారత్‌తో డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు మిచెల్ స్టార్క్‌తో పాటు జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్‌ను టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చారు.

Story first published: Saturday, November 24, 2018, 13:11 [IST]
Other articles published on Nov 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+