కాన్బెర్రా: ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ గజ్జగాయంతో టీ20 సిరీస్ నుంచి తప్పుకోగా... తాజాగా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఇంజ్యూరీ లిస్ట్‌లో చేరాడు. దాంతో అతను భారత్‌తో జరిగే అప్‌కమింగ్ టీ20 సిరీస్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. మిచెల్ స్టార్క్ బ్యాక్ పెయిన్‌తో పాటు, పక్కటెముకల్లో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని మూడో వన్డేకు ముందు ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వెల్లడించాడు.
భారత్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో ఆడిన స్టార్క్ మొత్తం 147 రన్స్ ఇచ్చి ఒకే వికెట్ తీశాడు. అయితే కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత స్టార్క్ మళ్లీ జట్టుకు అందుబాటులో ఉంటాడని ఫించ్ తెలిపాడు. కానీ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో అతన్ని టీ20 సిరీస్ ఆడించే సాహసం ఆసీస్ చేయకపోవచ్చు. ఒకవేళ స్టార్క్ గాయం తీవ్రమైనదైతే టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ చాలా నష్టపోనుంది. ఇప్పటికే ఈ సంప్రదాయక సిరీస్ కోసం ప్యాట్ కమిన్స్‌కు విశ్రాంతినిచ్చారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం ఫస్ట్ టీ20 జరగనుంది.
తొలి వన్డేలో ఆధిపత్యం చెలయించిన ఆసీస్.. మూడో వన్డేలో ఓడినప్పటికీ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కోహ్లీసేన 13 పరుగులతో గెలుపొంది క్వీన్ స్వీప్ తప్పించుకుంది. ఈ గెలుపుతో తదుపరి సిరీస్‌లకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది.
వారి రాకతో ఊపొచ్చింది.. ఆ ఇద్దరి విధ్వంసంతో విజయం దక్కింది: విరాట్ కోహ్లీ