
మనసులో మదనపడుతున్నాడేమో
పెర్త్ వేదికగా జరగడానికి ముందే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంది. బహుషా తన మనసులో ఏదో విషయం గురించి మదనపడుతున్నాడేమోనని అనుకుంటున్నాను. తనకు అవసరమైతే తనకు తగిన సూచనలిస్తానని ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ తెలిపారు. రెండో టెస్ట్ జరగనున్న పెర్త్ పిచ్ పూర్తిగా పేస్‌కు సహకరించనున్న నేపథ్యంలో తిరిగి ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం గాడిలో పడుతుందని ఈ సందర్భంగా జాన్సన్ తెలిపాడు.

స్టార్క్ తప్పకుండా రాణిస్తాడనే ఆశాభావంతో
ప్రముఖ మీడియా నెట్‌వర్క్ బీబీసీతో మాట్లాడిన జాన్సన్ జట్టుకు కొన్ని సూచనలు చేశాడు. స్టార్క్ ఆడిలైడ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 2, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి కట్డి చేసేందుకు ప్రయత్నించినా.. భారత్ 31 పరుగులతో ఆధిక్యంతో తొలి టెస్టును విజయంతో ముగించింది. రెండో టెస్టులో స్టార్క్ తప్పకుండా రాణిస్తాడని జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

పెర్త్ వేదికగా రెండో టెస్టులో
టెస్టుల్లో జాన్సన్ ఆస్ట్రేలియా బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. 12 నెలలుగా స్టార్క్ తన కాలి చీలమండ గాయాలతో బాధపడుతున్నాడన్నారు. స్టార్క్ 8 టెస్టు మ్యాచుల్లో 29 వికెట్లు, నాథన్ లియాన్ 10 మ్యాచ్‌ల్లో 46 వికెట్లు, పాట్ కమ్మిన్స్ 8 మ్యాచుల్లో 40, జోష్ హజెల్‌వుడ్ 8 మ్యాచుల్లో 30 వికెట్లు తీశారన్నారు. వీరందరి కంటే స్టార్క్ ఆడెలైడ్‌లో మంచి ప్రతిభ కనబరిచినట్లు రికార్డులే చెబుతున్నాయి. ఆస్ట్రేలియా-టీమిండియా శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్‌లో పాల్గొననున్నాయి.


Click it and Unblock the Notifications












