Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాక్సింగ్ డే టెస్టుకు ఒక్క మార్పుతో బరిలోకి దిగనున్న ఆస్ట్రేలియా

India vs Australia: Mitch Marsh Replaces Out of Form Handscomb for Boxing Day Test

మెల్‌బోర్న్: పెర్త్ విజయానంతరం ఆస్ట్రేలియా మూడో టెస్టును తేలిగ్గా తీసుకోవడం లేదు. బాక్సింగ్ డే టెస్టుకు జట్టులో మార్పులు చేసుకుంది. భారత్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా బుధవారం ఆరంభంకానున్న బాక్సింగ్ డే టెస్టుకు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు మంగళవారం ఖరారు చేసింది. పెర్త్ టెస్టులో గెలిచిన విన్నింగ్ జట్టును కొనసాగించకుండా.. ఒక కీలక మార్పు చేయడం మినహా మిగతా ఆటగాళ్లను మూడో టెస్టుకు కొనసాగించింది. తొలి రెండు టెస్టులకు దూరమైన మిచెల్ మార్ష్ తిరిగి తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.

పేసర్ పీటర్ హాండ్స్‌కాంబ్‌కు విశ్రాంతినిచ్చారు. టెస్టు మొత్తంలో 34, 14, 7, 13 స్కోరుతో విఫలమైయ్యాడు. ఆసీస్ మీడియా వేదికగా ఆసీస్ క్రికెట్ దిగ్గజాలు షేన్ వార్న్, రిక్కీ పాంటింగ్ లాంటి వాళ్లు అతని ప్రదర్శనపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో కెప్టెన్ టిమ్ పైనె మాత్రం తమ జట్టు బౌలర్లకు హాండ్స్ కాంబ్ మద్దతిస్తాడని చెప్పుకొచ్చాడు. చాలా కొద్ది కారణాలతో మాత్రమే అతనిని తప్పిస్తున్నట్లు పైనె పేర్కొన్నాడు. యాషెస్ సిరీస్‌లో చక్కగా రాణించాడని త్వరలోనే తిరిగి ఫామ్ అందుకుంటాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఫామ్‌లో ఉన్న ఆసీస్ బౌలర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, జోష్ హేజిల్‌వుడ్‌లకు మార్ష్ సహకారం అందించనున్నాడు. బాక్సింగ్ డే టెస్టుకు ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) ఆతిథ్యమిస్తోంది.

ఆస్ట్రేలియా టీమ్: అరోన్ ఫించ్, మార్కస్ హారీస్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, టిమ్ పైన్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, జోష్ హేజిల్‌వుడ్.

Story first published: Tuesday, December 25, 2018, 15:54 [IST]
Other articles published on Dec 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+