'టీమిండియా జడేజాను తీసుకోకపోవడం పెద్ద పొరబాటు'


న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి విజయాన్ని భారత్ ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో రెండో టెస్టును ఆరంభించిన భారత్.. జడేజాను జట్టులోకి తీసుకోకుండానే బరిలోకి దిగింది. కొద్ది మ్యాచ్‌లకు ముందు నుంచి ఒకరోజు ముందుగానే తుది జట్టును ప్రకటిస్తున్న భారత్.. శుక్రవారం జరగనున్న రెండో టెస్టుకు ముందే గురువారం జట్టును ప్రకటించేసింది. ఈ క్రమంలో అశ్విన్, రోహిత్‌లకు విశ్రాంతి కల్పిస్తూ ఉమేశ్ యాదవ్, హనుమ విహారీలను జట్టులోకి తీసుకుంది. అయితే రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకోకుండా భారత్ పెద్ద పొరబాటు చేసిందంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పేర్కొన్నాడు.
లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గానూ రాణించేవాడు
'జడేజాను తీసుకోకుండా భారత్ పెద్ద తప్పే చేసిందని అనుకుంటున్నాను. కేవలం అతను బౌలింగ్‌లోనే కాదు. బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గానూ రాణించేవాడు. దీంతో భారత్‌కు రెండో టెస్టులో మరి కాసేపు ఇన్నింగ్స్ కొనసాగించేందుకు అవకాశం ఉండేది. ఈ ఎంపిక ఆస్ట్రేలియాకు ఓ రకంగా ఉపయోగపడుతుందనే చెప్పాలి' అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

భువీ, జడేజాలను మాత్రం దూరంగానే
ఫేసర్లు కీలకంగా మారనున్న పెర్త్ పిచ్‌పై రాణిస్తాడని ఉమేశ్ యాదవ్‌ను తీసుకుంది టీమిండియా. కానీ, అనూహ్యంగా భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజాలను మాత్రం దూరంగానే ఉంచింది. జడేజాను జట్టులోకి తీసుకోకపోవడంతో మండిపడుతున్న నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సెలక్టర్ల తీరుపై మండిపడుతున్నారు. రవీంద్ర జడేజా గతంలో మాదిరి కాకుండా మూడు ఫార్మాట్లలోనూ చక్కగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌లోనూ పరవాలేదనిపిస్తూ.. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై ఫైనల్ మ్యాచ్ గెలిచేందుకు కీలకంగా వ్యవహరించాడు.

సెంచరీతో మెరుపులు కురిపించిన జడేజా
సొంతగడ్డపై రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సెంచరీతో మెరుపులు కురిపించాడు. మరోవైపు రంజీ ట్రోఫీల్లో రైల్వేస్ జట్టుపై ఆడిన జట్టులోనూ సత్తా చాటాడు. కానీ, పెర్త్ టెస్టుకు జడేజాను పక్కకు పెట్టడం అభిమానులకు మింగుడుపడని విషయంగా మారింది. ఈ క్రమంలో జడేజా రికార్డులు, ఈ ఏడాది ప్రదర్శనను గుర్తు చేస్తూ ట్వీట్ల ద్వారా అతనిని ఎంపిక చేయాల్సిందంటూ సెలక్టర్లను కోరుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications