గబ్బాటెస్ట్‌లో బుమ్రా ఉంటే భారత్‌కు మేలు: మదన్‌లాల్

Ind vs Aus 4th Test : Bumrah's Presence In 4th Test 'will Be Beneficial' For Team India - Madan Lal

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగే నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్త్‌ బుమ్రా ఆడితే మంచిదని మాజీ క్రికెటర్‌ మదన్‌లాల్‌ అభిప్రాయపడ్డాడు. భిన్నంగా ఉండే గబ్బా పిచ్‌పై అత‌ను ఉంటే టీమిండియాకు లాభిస్తుందన్నాడు. అతను యాభై శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నా జట్టులోకి తీసుకొనే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఇక సిడ్నీ టెస్ట్‌లో ఫీల్డింగ్ చేసే క్రమంలో బుమ్రా పొత్తికడుపులో గాయమైన విషయం తెలిసిందే. దాంతో అతను చివరి టెస్ట్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బుమ్రా గాయంపై మాట్లాడిన మదన్‌లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బుమ్రా ఉంటే జట్టుకు లాభం..

బుమ్రా ఉంటే జట్టుకు లాభం..

‘బ్రిస్బేన్‌ మైదానం భిన్నమైంది. టీమిండియాకు కచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయి. ఒకవేళ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆడితే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది. గాయాలతో సీనియర్లు, కీలక ఆటగాళ్లు లేకపోయినా రిజర్వు బెంచ్‌ పటిష్టంగానే ఉంది. వారికి సుదీర్ఘ ఫార్మాట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దొరుకుతుంది. ఏదేమైనా సిరీసులో ఆఖరి మ్యాచ్‌ కావడంతో రెండు జట్లు హోరాహోరీగా తలపడటం ఖాయం.

అనేక సవాళ్లు..

అనేక సవాళ్లు..

టీమిండియా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సగానికి పైగా ఆటగాళ్లు గాయపడ్డారు. కీలక ఆటగాళ్లు లేని లోటు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికైతే తుది 11 మంది ఆడటమే కష్టంగా అనిపిస్తోంది. గాయాల నేపథ్యంలో రిజర్వుబెంచ్‌లో ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతాయి. ఒకవేళ అశ్విన్‌ ఫిట్‌గా ఉంటే ఆడుతాడు. నిజానికి ఇదెంతో మంచివార్త. గాయాలు, జట్టుకు సంబంధించిన పూర్తి వివరాలపై గురువారాం క్లారిటీ రావచ్చు' అని మదన్‌ లాల్‌ తెలిపారు.

ఇంజ్యూరీ లిస్ట్

ఇంజ్యూరీ లిస్ట్

ఇక సిడ్నీ టెస్టు ముగిసే సరికి టీమిండియాలో గాయాల బారిన పడ్డ ఆటగాళ్ల జాబితా మరింత పెరిగింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ వెన్నుముక నొప్పితో బాధపడుతున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా పొత్తికడుపు, రిషభ్ పంత్ మోచేతి నొప్పితో బాధపడుతున్నాడని తెలిసింది. అశ్విన్ కూడా నాలుగో టెస్టు ఆడటంపై అనుమానాలున్నాయి. ఇప్పటికే జడేజా, షమీ, ఉమేశ్ యాదవ్, హనుమ విహారీ గాయాలతోనే జట్టుకు దూరమయ్యారు. మయాంక్ అగర్వాల్ కూడా తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో భారత్ ఎలా రాణిస్తుందో? అనేది ఆసక్తికరంగా మారింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, January 14, 2021, 12:01 [IST]
Other articles published on Jan 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X