Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup 2020 Quarterfinal: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

India vs Australia Live Score, U19 World Cup 2020 Quarterfinal: Australia win toss, opt to bowl

హైదరాబాద్: అండర్-19 వరల్డ్‌కప్ 2020లో భారత యువ జట్టు నాకౌట్ మ్యాచ్‌కు సిద్ధమైంది. లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా మంగళవారం క్వార్టర్‌ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాకెంజీ హార్వే బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఫలితంగా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్ ప్రియమ్ గార్గ్ మాట్లాడుతూ తొలుత బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. టాస్ గెలిస్తే మేము కూడా ఫీల్డింగే ఎంచుకునే వాళ్లమని చెప్పాడు. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచామని, కానీ ఈ మ్యాచ్ ఓ సవాల్ అని అన్నాడు.

జట్టులో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నట్లు చెప్పాడు. కాగా, ఈ మెగా టోర్నీలో ఇప్పటికే భారత యువ జట్టు మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇదిలా ఉంటే, ఈ నాకౌట్‌ మ్యాచ్‌లోనూ భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాపై టీమిండియా మెరుగైన రికార్డుని కలిగి ఉంది.

2013 నుంచి అండర్‌-19 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదు సార్లు తలపడగా నాలుగు సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఈ టోర్నీలో రవి బిష్టోయ్‌ 3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి ఈ ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

జట్ల వివరాలు

ఇండియా: యశస్వి జైస్వాల్, దివ్యన్ష్ సక్సేనా, తిలక్ వర్మ, ప్రియామ్ గార్గ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సిద్ధేష్ వీర్, అధర్వ అంకోలేకర్, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, ఆకాష్ సింగ్

ఆస్ట్రేలియా: సామ్ ఫన్నింగ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, మాకెంజీ హార్వే (కెప్టెన్), లాచ్లాన్ హిర్న్, ఆలివర్ డేవిస్, పాట్రిక్ రోవ్ (వికెట్ కీపర్), కోరీ కెల్లీ, కానర్ సుల్లీ, తన్వీర్ సంఘ, టాడ్ మర్ఫీ, మాథ్యూ విల్లాన్స్

Story first published: Tuesday, January 28, 2020, 14:00 [IST]
Other articles published on Jan 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+