సిడ్నీ టెస్ట్: తడబడుతోన్న ఆస్ట్రేలియా, డ్రింక్స్ విరామానికి ఆసీస్ 157/4

హైదరాబాద్: సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా తడబడుతోంది. 55 ఓవర్లు ముగిసే సరికి డ్రింక్స్ విరామానికి 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (4), పీటర్ హ్యాండ్స్ కోంబ్ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ ఇంకా 465 పరుగుల వెనుకంజలో ఉంది.
ఓవర్‌నైట్ స్కోరు 24/0తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టులోని ఓపెనర్లు కాసేపు క్రీజులో పాతుకుపోవడంతో 127/1తో గట్టి పోటీ ఇచ్చేటట్లు కనిపించింది. అయితే, రెండో సెషన్‌లో మాత్రం క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుని మ్యాచ్‌పై పట్టు కోల్పోతుంది.
ఓపెనర్ హారిస్ హాఫ్ సెంచరీ
శనివారం వ్యక్తిగత స్కోరు 19 వద్ద ఆటని కొనసాగించిన ఓపెనర్ హారిస్ (79) సిరీస్‌లో హాఫ్ సెంచరీతో తొలిసారి చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (27) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరినప్పటికీ.. క్రీజులో పాతుకుపోయిన నిలిచిన హారిస్‌కు మద్దతుగా నిలిచాడు.
8 పరుగుల వద్ద షాన్ మార్ష్ ఔట్
ఈ క్రమంలో హారిస్ ఆఫ్ సైడ్ చూడముచ్చటైన కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని లక్ష్యంగా చేసుకుని వరుసగా బౌండరీలు బాదాడు. ప్రమాదకరంగా మారిన హారిస్‌ని జట్టు స్కోరు 128 వద్ద జడేజా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన షాన్ మార్ష్ (8) పరుగుల వద్ద పెవిలియన్ కుచేరాడు.
రహానే సూపర్ క్యాచ్
అనంతరం క్రీజులోకి వచ్చిన మార్నస్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు యత్నించాడు. అయితే మార్నస్ (38) పరుగుల వ్కక్తిగత స్కోరు వద్ద మహ్మద్ షమీ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టుకి కష్టాలు మొలయ్యాయి.
622/7 పరుగుల వద్ద భారత్ డిక్లేర్
కాగా, నాలుగో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ని 622/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. . ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియాలో పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సెంచరీలు నమోదు చేయడంతో భారీ స్కోరు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications