For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిడ్నీ టెస్టు: పుజారా డబుల్ మిస్... పంత్ సెంచరీ, భారత్ 622/7 డిక్లేర్డ్

India vs Australia 4th Test : Cheteshwar Pujara Slams Brilliant 193 | Oneindia Telugu
India vs Australia Live Score 4th Test Day 2: India Declare First Innings On 622/7 In Sydney

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ని 622/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఓవర్‌ నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియాలో పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సెంచరీలు నమోదు చేయడంతో భారీ స్కోరు చేసింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్ 4 వికెట్లు పడగొట్టగా, జోష్ హెజెల్‌ఉడ్‌కు రెండు, మిచెల్ స్టార్క్‌కు ఒక వికెట్ లభించింది. గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో తొలిరోజు యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (77) హాఫ్ సెంచరీతో రాణించగా, శుక్రవారం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (81) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

1
43626
తొలి సెషన్ నుంచే దూకుడుగా పుజారా

తొలి సెషన్ నుంచే దూకుడుగా పుజారా

శుక్రవారం వ్యక్తిగత స్కోరు 130 వద్ద ఇన్నింగ్స్‌ని కొనసాగించిన పుజారా తొలి సెషన్ నుంచే దూకుడుగా ఆడాడు. పేసర్ల బౌలింగ్‌లో ఫుల్‌ షాట్స్, చూటముచ్చటి కవర్ డ్రైవ్‌లతో అభిమానులను ఆకట్టుకున్నాడు. మరోవైపు పుజారాతో కలిసి శుక్రవారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హనుమ విహారి (42) మాత్రం మరో మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి

ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి

ఆసీస్ స్పిన్నర్ లయన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ కోసం విహారి ప్రయత్నించగా బ్యాట్ అంచున తాకిన బంతి షార్ట్‌లెగ్‌లో గాల్లోకి లేచింది. దీంతో అక్కడే ఉన్న ఫీల్డర్ మార్నస్ ఎలాంటి తడబాటు లేకుండా క్యాచ్‌ను అందుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ మరింత దూకుడుగా ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు.

ఆరో వికెట్‌కి 89 పరుగుల భాగస్వామ్యం

ఈ క్రమంలో ఆరో వికెట్‌కి వీరిద్దరూ కలిసి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టు స్కోరు 418 వద్ద పుజారా ఔటవగా.. అనంతరం వచ్చిన జడేజా మరింత దూకుడుగా ఆడాడు. వన్డే మాదిరి రెచ్చిపోయి ఆడాడు. స్పిన్నర్లు, పేసర్లు అని తేడా లేకుండా జడేజా విజృంభించాడు. రిషబ్ పంత్ దూకుడుగా ఆడి ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీని నమోదు చేశాడు.

చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన పంత్

137 బంతుల్లో 8 ఫోర్ల‌ సాయంతో 100 ప‌రుగులు చేసిన రిష‌బ్ పంత్ చివరి వరకు నాటౌట్‌గా ఉన్నాడు. తాజా సెంచరీ రిషబ్ పంత్‌కు టెస్టుల్లో రెండో సెంచరీ కావడం విశేషం. ఆస్ట్రేలియాలో తొలి సెంచ‌రీ చేసిన భారత వికెట్ కీప‌ర్‌గా కూడా పంత్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో పంత్ తన సెంచరీని సాధించాడు. జడేజా, పంత్‌‌లు దాదాపు 37 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా బౌలర్లకు వికెట్ ఇవ్వకుండా క్రీజులో నిలిచారు.

జడేజా హాఫ్ సెంచరీ

మరోవైపు జడేజా సైతం 114 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 81 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ అనంతరం లయాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరి జోడీ ఏడో వికెట్‌కి అభేద్యంగా 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు భారీ స్కోరు సాధించ‌డంతో 622/7 వ‌ద్ద కెప్టెన్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.

Story first published: Friday, January 4, 2019, 12:15 [IST]
Other articles published on Jan 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+