సిడ్నీ టెస్టు: రెండో రోజు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన పంత్ రివర్స్ స్వీప్ షాట్ (వీడియో)

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆతిథ్య జట్టుతో జరుగుతున్న చివరి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ హవా కొనసాగుతోంది. ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియాలో పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సెంచరీలు నమోదు చేయడంతో భారీ స్కోరు చేసింది.
దీంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ని 622/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆటలో రెండోరోజైన శుక్రవారం టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బాదిన ఓ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ మార్నస్ లబులచాగ్నే బౌలింగ్‌లో రిషబ్ పంత్ ఆడిన స్వీప్ షాట్ క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
పంత్ రివర్స్ స్వీప్ షాట్
స్పిన్నర్ మార్నస్ వేసిన బంతిని రిషబ్ పంత్ చాలా సింపుల్‌గా స్వీప్ షాట్‌తో బౌండరీ లైన్ దాటించాడు. రిషబ్ పంత్ షాట్‌కు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఈరోజు ఆటలో అసాధరణ షాట్ అంటూ కామెంట్ పెట్టింది. ఈ షాట్‌తో పంత్ తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకున్నాడు.

సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్
కాగా, ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. దూకుడుగా ఆడిన పంత్ తక్కువ బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. 138 బంతుల్లోనే 8 ఫోర్ల సాయంతో రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

పంత్ ఖాతాలో అరుదైన ఘనత
ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో భారత్ వికెట్ కీపర్‌లు ఎవరూ టెస్ట్ సెంచరీ సాధించలేదు. తొలిసారి పంత్ ఆ ఘనత సాధించాడు. గతంలో ఫారూఖ్ ఇంజినీర్ 1967వ సంవత్సరంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆస్ట్రేలియా పర్యటన చేశాడు. ఈ పర్యటనలో ఫారూఖ్ ఇంజినీర్ 89 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన కీపర్‌గా రికార్డు సాధించాడు.

టెస్టుల్లో పంత్‌కు ఇది రెండో సెంచరీ
ఇక, భారత్ తరుపున ఇప్పటివరకు తొమ్మిది టెస్టులాడిన రిషబ్ పంత్‌కు ఇది రెండో సెంచరీ. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో పంత్ 114 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు జెఫ్రీ డుజాన్ తర్వాత ఇంగ్లాండ్‌లోనూ, ఆస్ట్రేలియాలోనూ సెంచరీలు చేసిన పర్యాటక జట్టు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 622/7 డిక్లేర్డ్
దీంతో పాటు ఒక టెస్ట్ సిరీస్‌లో 200 కంటే పరుగులు, 20 క్యాచ్‌లు అందుకున్న ఉపఖండపు తొలి వికెట్ కీపర్‌గా రిషబ్ అరుదైన ఘనత సాధించాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ని 622/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్ నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియాలో పుజారా (193), పంత్ (159 నాటౌట్) సెంచరీలు నమోదు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications