3rd ODI: మెల్‌బోర్న్‌లో 6 వికెట్లు తీసిన చాహల్, భారత్ టార్గెట్ 231

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై తొలిసారి వన్డే ఆడిన భారత చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అద్భుత ప్రదర్శన చేశాడు. మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన మూడో వన్డేలో యజువేంద్ర చాహల్ దెబ్బకు ఆసీస్ విలవిల్లాడింది. ఈ మ్యాచ్‌లో చాహల్ అద్భుత గణాంకాలను నమోదు చేశాడు.
చాహల్ (6/42) దెబ్బకి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. దీంతో మూడో వన్డేలో భారత్‌కు ఆస్ట్రేలియా 231 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో చాహల్ 6 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్, షమి రెండేసి వికెట్లు తీశారు.
హ్యాండ్స్‌కోంబ్ హాఫ్ సెంచరీ
ఆతిథ్య జట్టులో పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (58) మాత్రమే హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించాడు. రెండో వన్డేలో సెంచరీ సాధించిన షాన్ మార్ష్ (39)తో పాటు.. కీలకమైన ఉస్మాన్ ఖవాజా (34), స్టాయినిస్ (10) వికెట్లను చాహల్ పడగొట్టి ఆ జట్టుని ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. గత రెండు రెండో వన్డేల్లోనూ కుల్దీప్ యాదవ్ ఆడటంతో, చాహల్‌కి తుది జట్టులో అవకాశం దక్కలేదు.
27 పరుగులకే ఓపెనర్ల ఔట్
మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 27 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తొలి పవర్ ప్లే ముగిసే సమయానికి ఓపెనర్లు అలెక్స్ కేరీ (5), అరోన్ ఫించ్ (14)లను భువనేశ్వర్ కుమార్ బోల్తా కొట్టించగా.. ఆ తర్వాత ఒకే ఓవర్‌లో మణికట్టు స్పిన్నర్ చాహల్ రెండు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాని కష్టాల్లోకి నెట్టాడు.
వరుసగా రెండు వికెట్లు తీసిన చాహల్
ఇన్నింగ్స్ 24వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్‌లో మొదటి బంతినే హిట్ చేసేందుకు షాన్ మార్ష్ (39) క్రీజు వెలుపలికి వచ్చాడు. చాహల్ తెలివిగా బంతిని వైడ్ రూపంలో లెగ్‌సైడ్ విసరగా.. దానిని అందుకున్న ధోనీ స్టంపౌట్ చేశాడు. అదే ఓవర్‌లో నాలుగో బంతిని అంచనా వేయడంలో తడబడిన ఉస్మాన్ ఖవాజా (34) చాహల్‌కే సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

6 వికెట్లు తీసిన చాహల్
వీరిద్దరినీ వెంట వెంటనే అవుట్ చేసి చాహల్ వికెట్ల వేట ప్రారంభించాడు. ఒక ఎండ్‌లో హ్యాండ్స్‌కోంబ్ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టు స్కోరు 200 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 63 బంతుల్లో 2 ఫోర్లతో 58 పరుగులు చేసి 8వ వికెట్‌గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో చాహల్ 6 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్, షమి రెండేసి వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications