
హైదరాబాద్: మెల్బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ బౌలర్లు జోరు కొనసాగిస్తున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 123 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. తొలి పవర్ ప్లే ముగిసే సమయానికి ఓపెనర్లు అలెక్స్ కేరీ (5), అరోన్ ఫించ్ (14)లను భువనేశ్వర్ కుమార్ బోల్తా కొట్టించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఒకే ఓవర్‌లో మణికట్టు స్పిన్నర్ చాహల్ రెండు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కష్టాల్లోకి నెట్టాడు. ఇన్నింగ్స్ 24వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్‌లో మొదటి బంతినే హిట్ చేసేందుకు షాన్ మార్ష్ (39) క్రీజు వెలుపలికి వచ్చాడు. కానీ.. చాహల్ తెలివిగా బంతిని వైడ్ రూపంలో లెగ్‌సైడ్ విసరగా.. దాన్ని చాకచక్యంగా అందుకున్న ధోనీ స్టంపౌట్ చేశాడు.
అదే ఓవర్‌లో నాలుగో బంతిని అంచనా వేయడంలో తడబడిన ఉస్మాన్ ఖవాజా (34) చాహల్‌కే సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించిన ఈ జోడీని చాహల్ విడగొట్టాడు. ఇద్దరినీ వెంట వెంటనే పెవిలియన్‌కు పంపాడు. 100 పరుగుల వద్ద ఖవాజా(34) మూడో వికెట్‌గా అవుటయ్యాడు. తర్వాత షాన్ మార్ష్(39) కూడా పెవిలియన్ దారిపట్టాడు.
అంతకముందు టాస్ ఓడి ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఆరంభించగానే వరుణుడు అడ్డుతగిలాడు. రెండు బంతులు వేయగానే చినుకులు మొదలయ్యాయి. దీంతో ఆటకు కాసేపు అంతరాయ కలిగింది. ఆట తిరిగి మొదలయ్యాక ఆసీస్‌ను టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ గట్టి దెబ్బ తీశాడు. ఆ తర్వాత స్టొయినిస్‌ను కూడా చాహల్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది.
ప్రస్తుతం 36 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 171 పరుగులు చేసింది. క్రీజులో హ్యాండ్స్‌కోంబ్ (33), రిచర్డ్‌సన్(2) పరుగులతో ఉన్నారు.