Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఖవాజ సెంచరీ: రాంచీ వన్డేలో టీమిండియా విజయ లక్ష్యం 314

India vs Australia Live Score, 3rd ODI: Australia set 314-run target for India

హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆతిథ్య జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్(93), ఉస్మాన్ ఖవాజ(104) సెంచరీతో చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 314 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, మహ్మద్ షమీ ఒక వికెట్ తీశారు.

టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్

టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్

ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ఫించ్, ఖవాజా చక్కటి ఆరంభాన్ని అందించారు. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న ఆసీస్ ఓపెనర్లు ఇద్దరూ రాంచి వన్డేలో రాణించారు. కేదార్ జాదవ్ వేసిన 17వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్ బాది 19 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఫించ్ 19వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

కుల్దీప్ బౌలింగ్‌లో ఫించ్ ఔట్

కుల్దీప్ బౌలింగ్‌లో ఫించ్ ఔట్

ఆ తర్వాత కొద్ది సేపటికే షమీ వేసిన 19వ ఓవర్లో ఖవాజా కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో దానిని సద్వినియోగం చేసుకొని వీరిద్దరూ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెంచరీకి చేరువగా వచ్చిన ఆరోన్ ఫించ్‌ను 32వ ఓవర్లో కుల్దీప్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కి 193 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

వన్డేల్లో తొలి సెంచరీ

వన్డేల్లో తొలి సెంచరీ

ఆ తర్వాత ఖవాజా వన్డేల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫించ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. అయితే సెంచరీ సాధించిన కొంత సమయానికే ఖవాజా(104) షమీ బౌలింగ్‌లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం మ్యాక్స్‌వెల్(47) అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.

330కు పైగా స్కోరు చేసేలా

330కు పైగా స్కోరు చేసేలా

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ దూకుడు చూస్తే 330కు పైగా స్కోరు చేసేలా కనిపించారు. అయితే చివర్లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకోకుండా కోహ్లీ చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. ఆసీస్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చినా.. చివరి 10 ఓవర్లలో పరుగులు రాకుండా భారత బౌలర్లు విజయవంతమయ్యారు.

టీమిండియా విజయ లక్ష్యం 314

టీమిండియా విజయ లక్ష్యం 314

ఇక కుల్దీప్ వేసిన 44వ ఓవర్‌లో షాన్‌ మార్ష్(7), హాండ్స్‌కోండ్(0) ఔట్ అయ్యారు. ఈ ఓవర్‌లో రెండో బంతికి షాన్ మార్ష్(7).. విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించగా నాలుగో బంతికి హాండ్స్‌కాంబ్(0)ను ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. చివర్లో స్టోయినిస్ (31 నాటౌట్), అలెక్స్ కేరీ(21 నాటౌట్) రాణించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది.

1
45587
Story first published: Friday, March 8, 2019, 17:38 [IST]
Other articles published on Mar 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+