పెర్త్ టెస్ట్‌లో భారత్ పయనమెటు?: విజయానికి 175 పరుగులు, ఓటమికి 5 వికెట్లు


హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హనుమ విహారి(24), రిషబ్ పంత్(9) పరుగులతో ఉన్నారు.
ఇంకో రోజు ఆట మిగిలిన ఈ టెస్టులో భారత్ విజయం సాధించాలంటే 175 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్, హెజెల్‌ఉడ్ చెరో వికెట్లు తీయగా... మిచెల్ స్టార్క్‌కు ఒక వికెట్ లభించింది. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఇంతటి పెద్ద లక్ష్యాన్ని చేధించిన దాఖలా లేదు.
దీంతో పెర్త్ టెస్టు ఫలితం ఎలా ఉండబోతుందోనని ఆసక్తికరంగా మారింది. మరోవైపు పచ్చికతో కూడిన పిచ్ క్రమంగా బ్యాటింగ్‌కి కష్టంగా మారడం విశేషం. నాలుగోరోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 243 పరుగులు చేసి ఆలౌటైంది.
భారత్ విజయ లక్ష్యం 287
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 43 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన తొలి ఓవర్‌లోనే భారత్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి చెత్త ప్రదర్శన చేశాడు. స్టార్క్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
13 పరుగులకే రెండు వికెట్లు
దీంతో పరుగులేమీ చేయకుండానే రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే పుజారా (4) కూడా హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పుజారా ఔటైన తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీ విరామ సమయానికి భారత్ 6.2 ఓవర్లకు గాను 18/2 స్థితిలో నిలిచింది.
నాథన్ లియాన్ బౌలింగ్‌లో కోహ్లీ ఔట్
టీ విరామం అనంతరం మురళీ విజయ్-కోహ్లీల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసింది. అయితే వీరి జోడి 35 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లీ ఔటయ్యాడు. నాథన్ లియాన్ బౌలింగ్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి కెప్టెన్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే నిలకడగా ఆడుతోన్న మురళీ విజయ్‌ని బౌల్డ్ చేసి భారత్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు.
ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో రహానే ఔట్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హనుమ విహారితో కలిసి రహానే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇన్నింగ్స్ 34వ ఓవర్ ఐదో బంతికి రహానే(30) ఔటయ్యాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ట్రావిస్ హెడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. రహానే ఔటైన తర్వాత క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. అంతకముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఆరు వికెట్లు సాధించగా, బూమ్రా మూడు, ఇషాంత్ శర్మ వికెట్ తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications