లంచ్ విరామానికి ఆస్ట్రేలియా స్కోరు 190/4

పెర్త్: పెర్త్ వేదికగా భారత్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడుతోన్న ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. ఆటలో నాలుగోరోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆసీస్ ప్రస్తుతం నిలకడగా ఆడుతోంది. ఆదివారం చివరి సెషన్‌లో ఓపికతో క్రీజులో నిలిచిన ఉస్మాన్ ఖవాజా (67).. కెప్టెన్ టిమ్‌పైన్ (37)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. దీంతో.. ఆస్ట్రేలియా 190/4తో కొనసాగుతుండగా.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 43 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే.. మొత్తంగా 233 పరుగుల లీడ్‌లో ఆ జట్టు కొనసాగుతోంది.
రెండో ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దిశగా ఆసీస్
క్రమంగా బ్యాటింగ్ కష్టమవుతోన్న ఈ పిచ్‌పై 250పైచిలుకు లక్ష్యఛేదన అంటే భారత్‌కి కష్టమే..! కాబట్టి.. వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాని కట్టడి చేయాల్సిన బాధ్యత టీమిండియా బౌలర్లపై పెరుగుతూ వస్తుంది. శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు 283 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో.. ఆసీస్‌కి 43 పరుగుల ఆధిక్యం లభించింది. అడిలైడ్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
మూడో రోజు భారత తొలి ఇన్నింగ్స్ ముగిసిందిలా
తొలి సెషన్ ఆరంభ ఓవర్‌లోనే భారత్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసేందుకు రహానె (51: 105 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సు) ప్రయత్నించగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా కీపర్ టిమ్‌పైన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. జట్టు స్కోరు 173 వద్దే భారత్ 4వ వికెట్ చేజార్చుకుంది. ఆ తర్వాత వచ్చిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి (20: 46 బంతుల్లో 2ఫోర్లు) కాసేపు క్రీజులో నిలిచినా.. జట్టు జట్టు స్కోరు 233 వద్ద అతనూ ఔటైపోయాడు.
251 వద్ద అంపైర్ వివాదాస్పద నిర్ణయం
హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడిన బంతిని వెంటాడి కీపర్ టిమ్‌పైన్ చేతికి అతను చిక్కాడు. ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లి 251 వద్ద అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా ఔటవడంతో.. భారత్ జట్టు మళ్లీ ఒత్తిడిలో పడింది. ఒక ఎండ్‌లో రిషబ్ పంత్ (36: 50 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సు) క్రీజులో నిలిచినా.. మొహ్మద్ షమీ (0), ఇషాంత్ శర్మ (1), ఉమేశ్ యాదవ్ (4 నాటౌట్), జస్‌ప్రీత్ బుమ్రా (4) తేలిపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications