Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెర్త్‌లో రెండో టెస్టు: ట్రావిస్ హెడ్ 50, రహానేకు క్యాచ్ ఇచ్చిన మార్ష్ (వీడియో)

India vs Australia Live Score, 2nd Test Day 1: Third Test half-century for Travis Head

హైదరాబాద్: పెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ సాధించాడు. నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ సమయోచితంగా పరుగులు రాబడుతున్నాడు. పీటర్ హ్యాండ్స్ కోంబ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ నిలకడగా ఆడుతూ 70 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు.

టెస్టుల్లో ట్రావిస్ హెడ్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. అడిలైడ్ టెస్టు కూడా ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. అంతకముందు షాన్ మార్ష్ (45)తో కలిసి నిలకడగా ఆడుతూ ట్రావిస్ హెడ్ ఆసీస్ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. అయితే జట్టు స్కోరు 232 పరుగుల వద్ద షాన్ మార్ష్ హనుమ విహారి బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

హనుమ విహారి వేసిన 76.6వ బంతిని మార్ష్‌ వికెట్ల మీదకు ఆడుకోబోయి స్లిప్‌లో రహానేకు చిక్కాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. షాన్ మార్ష్ ఔటైన తర్వాత క్రీజులోకి కెప్టెన్ టిమ్ పైన్ వచ్చాడు. ప్రస్తుతం 82 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది.

1
43624

శుక్రవారం తొలి సెషన్‌లో వికెట్లు తీసేందుకు తీవ్రంగా శ్రమించిన భారత బౌలర్లు లంచ్ తర్వాత చెలరేగుతున్నారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా కోల్పోయిన ఐదు వికెట్లలో హనుమ విహారికి రెండు, బుమ్రా, షమీ, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది.

Story first published: Friday, December 14, 2018, 15:06 [IST]
Other articles published on Dec 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+