Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెర్త్‌లో రెండో టెస్టు: టీ బ్రేక్ తర్వాత కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ చూశారా? (వీడియో)

India vs Australia Live Score, 2nd Test Day 1: Handscomb gone for 7 as Ishant strikes

హైదరాబాద్: పెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. టీ విరామం అనంతరం ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పీటర్ హ్యాండ్స్ కోంబ్ (7) పరుగుల వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో జట్టు స్కోరు 148 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది.

మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన హ్యాండ్స్‌కోంబ్ క్యాచ్

అయితే, పీటర్ హ్యాండ్స్ కోంబ్ క్యాచ్ వీడియో మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 55వ ఓవర్ తొలి బంతిని పీటర్ హ్యాండ్స్ కోంబ్ థర్డ్ మ్యాన్ దిశగా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లోకి దూసుకెళ్లగా.. మెరుపు వేగంతో స్పందించిన విరాట్ కోహ్లీ కుడి చేత్తో అమాంతం గాల్లోకి ఎగిరి క్యాచ్‌గా అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 59 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 170/4

59 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 170/4

దీంతో 59 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షాన్ మార్ష్ (16), ట్రావిస్ హెడ్ (12) పరుగులతో ఉన్నారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా కోల్పోయిన నాలుగు వికెట్లలో ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, హనుమ విహారి తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేస్తుండగా ఓపెనర్లు హారిస్ (70), అరోన్ ఫించ్ (50) తొలి వికెట్‌కి 112 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ ఔటవడంతో జట్టు స్కోరు 134 వద్ద క్రీజులోకి వచ్చిన హ్యాండ్స్‌ కోంబ్ ఒకింత ఒత్తిడిలోనే బ్యాటింగ్‌ని కొనసాగించాడు. దీంతో ఇషాంత్ శర్మ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన బంతికి అతను దొరికిపోయాడు.

రెండు మార్పులతో బరిలోకి టీమిండియా

రెండు మార్పులతో బరిలోకి టీమిండియా

ఈ మ్యాచ్‌లో పర్యాటక టీమిండియా జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన అశ్విన్, రోహిత్ స్థానాల్లో ఉమేష్ యాదవ్, హనుమ విహారి తుది జట్టులోకి వచ్చారు. పెర్త్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలించేది కావడంతో స్పిన్నర్ లేకుండా మొత్తం నలుగురు పేస్ బౌలర్లతోనే భారత్ బరిలోకి దిగింది.

జట్ల వివరాలు

భారత్‌ జట్టు: రాహుల్‌, విజయ్‌, కోహ్లి, పుజారా, రహానె, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, ఉమేశ్‌యాదవ్‌, ఇషాంత్‌, షమి, జస్‌ప్రీత్‌ బుమ్రా.

ఆస్ట్రేలియా: ఫించ్‌, హారిస్‌, ఖవాజా, షాన్‌ మార్ష్‌, హ్యాండ్స్‌కాంబ్‌, ట్రావిస్‌ హెడ్‌, టిమ్‌ పైన్‌, స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, లైయన్‌, హేజిల్‌వుడ్‌.

1
43624
Story first published: Friday, December 14, 2018, 13:42 [IST]
Other articles published on Dec 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+