For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్‌లో రెండో టెస్టు: కేఎల్ రాహుల్ క్యాచ్ మిస్, హారిస్‌కు లైఫ్ (వీడియో)

India vs Australia 2nd Test DAY 1 : Ohh! A Missed Catch By KL Rahul | Oneindia Telugu
India vs Australia Live Score, 2nd Test Day 1: Dropped! Harris gets a life on 60, thanks to Rahul

హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఫీల్డర్ల తప్పిదాల కారణంగా ఓపెనర్ మార్కస్ హారిస్‌కు లైఫ్ లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (50) హాఫ్ సెంచరీ ఔటైన తర్వాత ఉస్మాన్ ఖవాజాతో కలిసి మరో ఓపెనర్ మార్కస్ హారిస్ నిలకడగా ఆడుతున్నాడు.

సెకండ్ స్లిప్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ మిస్

అయితే, మార్కస్ హారిస్ (60) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఔట్‌సైడ్ ఆఫ్‌లో ఇచ్చిన క్యాచ్‌ని సెకండ్ స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ జారవిడిచాడు. దీంతో తనకు వచ్చిన లైఫ్‌ని సద్వినియోగం చేసుకున్న మార్కస్ హారిస్ సెంచరీ దిశగా ఆడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం 47 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 132/2 స్థితిలో నిలిచింది.

47 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 132/2

47 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 132/2

క్రీజులో మార్కస్ హారిస్ (69), షాన్ మార్ష్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. కాగా, ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 46వ ఓవర్ ఆఖరి బంతికి ఉస్మాన్ ఖవాజా (5) పరుగుల వద్ద వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో జట్టు స్కోరు 130 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది.

తొలి వికెట్‌గా ఆరోన్ ఫించ్

అంతకముందు హాఫ్ సెంచరీ చేసిన ఓపెనర్ ఆరోన్ ఫించ్ (50; 103 బంతుల్లో; 6 ఫోర్లు) జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 36వ ఓవర్ రెండో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా గడ్డపై ఆరోన్ ఫించ్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. దీంతో ఫించ్ హాఫ్ సెంచరీ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు.

వికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న భారత బౌలర్లు

వికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న భారత బౌలర్లు

పిచ్‌పై పచ్చిక ఉండటంతో పేస్, బౌన్స్ అతిగా సహకరిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ పెర్త్ పిచ్ బౌలర్లకు పెద్దగా సహకారం లభించడం లేదు. దీంతో వికెట్ల కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పర్యాటక టీమిండియా జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన అశ్విన్, రోహిత్ స్థానాల్లో ఉమేష్ యాదవ్, హనుమ విహారి తుది జట్టులోకి వచ్చారు.

1
43624
Story first published: Friday, December 14, 2018, 12:40 [IST]
Other articles published on Dec 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+