
పెర్త్: కంగారూ గడ్డపై సిరీస్ గెలువాలన్న ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అసలైన పోరాటం చేయనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. గాయాలబారిన పడి సతమతమవుతోన్న అశ్విన్, రోహిత్ లకు బదులు జట్టులోకి ఉమేశ్ యాదవ్, హనుమవిహారీలకు చోటు కల్పించారు.
తొలి టెస్ట్‌ను అలవోకగా నెగ్గినా.. ఇప్పుడు మాత్రం టీమిండియా సత్తాకు, సామర్థ్యానికి, నైపుణ్యానికి గట్టిపోటీ ఎదురుకానున్న నేపథ్యంలో శుక్రవారం ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న విరాట్‌సేన దానిని మరింతగా పెంచుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
కానీ కంగారూలకు అనుకూలంగా ఉన్న పిచ్‌పై టీమిండియాకు గెలుపు సాధ్యమవుతుందాననే సందేహం నెలకొంది. అధికారుల ఆదేశాల మేరకు క్యూరేటర్ బ్రెట్ స్పితోర్పి బ్రాండ్ న్యూ అప్టస్ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్‌ను పూర్తిగా బౌన్స్‌కు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తున్నట్లు తెలిపాడు.
సంప్రదాయకమైన వాకా పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త వికెట్‌లో పచ్చిక ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇరుజట్ల బౌలర్ల సత్తాకు ఇదో పెద్ద పరీక్షగా నిలువనుంది. గెలిచేందుకు ఎలాంటి వ్యూహానికైనా వెనుకడుగేయని ఆసీస్ ను ఓడించడం కోహ్లీసేనకు కత్తిమీద సాములాంటిదే.
ఆస్ట్రేలియా (జట్టు):
Aaron Finch, Marcus Harris, Usman Khawaja, Shaun Marsh, Peter Handscomb, Travis Head, Tim Paine (wk/c), Pat Cummins, Mitchell Starc, Nathan Lyon, Josh Hazlewood
భారత్ (జట్టు):
Lokesh Rahul, Murali Vijay, Virat Kohli (c), Cheteshwar Pujara, Ajinkya Rahane, Hanuma Vihari, Rishabh Pant (wk), Ishant Sharma, Umesh Yadav, Mohammed Shami, Jasprit Bumrah