For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వికెట్‌ కోసం బౌలర్ల విశ్వప్రయత్నాలు: లంచ్ విరామానికి ఆసీస్ 66/0

India vs Australia Live Score, 2nd Test Day 1: Aaron Finch, Marcus Harris Take Australia To 66/0 At Lunch

హైదరాబాద్: పెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు ఆరోన్ ఫించ్, మార్కస్ హారిస్ ఆచితూచి ఆడుతున్నారు. దీంతో వికెట్ కోసం భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు.

బౌలర్లకు పెద్దగా సహకారం లభించడం లేదు

పిచ్‌పై పచ్చిక ఉండటంతో పేస్, బౌన్స్ అతిగా సహకరిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ మొదటిరోజైన శుక్రవారం బౌలర్లకు పెద్దగా సహకారం లభించలేదు. దీంతో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా జట్టు వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు హారిస్ 36, ఫించ్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.

వికెట్ కోసం భారత బౌలర్ల విశ్వప్రయత్నాలు

వీరి జోడీని విడదీయడానికి టీమిండియా బౌలర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ తరఫున నలుగురు పేస్ బౌలర్లు శ్రమించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మ్యాచ్ ప్రారంభమైన తొలి గంటలో బౌలింగ్‌కు కలిసొచ్చే పరిస్థితులు ఉన్నప్పటికీ భారత బౌలర్లు సద్వినియోగం చేసుకోలేదు.

రెండు మార్పులతో బరిలోకి టీమిండియా

రెండు మార్పులతో బరిలోకి టీమిండియా

ఈ మ్యాచ్‌లో పర్యాటక టీమిండియా జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన అశ్విన్, రోహిత్ స్థానాల్లో ఉమేష్ యాదవ్, హనుమ విహారి తుది జట్టులోకి వచ్చారు. పెర్త్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలించేది కావడంతో స్పిన్నర్ లేకుండా మొత్తం నలుగురు పేస్ బౌలర్లతోనే భారత్ బరిలోకి దిగింది.

జట్ల వివరాలు

భారత్‌ జట్టు: రాహుల్‌, విజయ్‌, కోహ్లి, పుజారా, రహానె, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, ఉమేశ్‌యాదవ్‌, ఇషాంత్‌, షమి, జస్‌ప్రీత్‌ బుమ్రా.

ఆస్ట్రేలియా: ఫించ్‌, హారిస్‌, ఖవాజా, షాన్‌ మార్ష్‌, హ్యాండ్స్‌కాంబ్‌, ట్రావిస్‌ హెడ్‌, టిమ్‌ పైన్‌, స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, లైయన్‌, హేజిల్‌వుడ్‌.

1
43624
Story first published: Friday, December 14, 2018, 11:10 [IST]
Other articles published on Dec 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+