నిరాశపరిచిన ఓపెనర్లు: టీ విరామానికి భారత్ 86/2, ఆధిక్యం 101

హైదరాబాద్: అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓపెనర్లు వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యారు. ఆటలో మూడో రోజైన శనివారం ఓపెనర్లు మురళీ విజయ్ (18), కేఎల్ రాహుల్ (446) నిరాశ పరిచారు. దీంతో టీ విరామ సమయానికి భారత్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులతో నిలిచింది.
ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర్ పుజారా (11 ), కెప్టెన్ విరాట్ కోహ్లీ (2) పరుగులతో ఉన్నారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 15 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ 101 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 191/7తో ఈరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 235 పరుగులకి ఆలౌటైన సంగతి తెలిసిందే.

ఓవర్‌నైట్ స్కోరు 191/7తో తొలి ఇన్నింగ్స్‌ను
ఆటలో మూడో రోజైన శనివారం ఓవర్‌నైట్ స్కోరు 191/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియాను భారత్ బౌలర్లు 235కే ఆలౌట్ చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 15 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 191/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో 88.1 ఓవర్ల వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా కేవలం 44 పరుగులు మాత్రమే జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది.

ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ
భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మూడో రోజు ఆటలో భాగంగా తొలి వికెట్ మిచెల్ స్టార్క్(15) బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. 91.4 ఓవర్లో బుమ్రా వేసిన బంతిని మిచెల్ స్టార్క్(15; 34బంతుల్లో) పంత్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

వర్షం కారణంగా మధ్యలో నిలిచిన మ్యాచ్
అప్పటికే వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో కొంత సమయం ఆట నిలిచిపోయింది. మళ్లీ ఆట మొదలు కాగానే, షమీ మిగతా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ అత్యధికంగా 72 పరుగులు చేశాడు. ఆ తర్వాత హ్యాండ్స్ కాంబ్ (34), కవాజా (28) పరుగులతో ఫరవాలేదనిపించారు.
బుమ్రా, ఆశ్విన్‌లు మూడేసి వికెట్లు తీసుకోగా
భారత బౌలర్లలో బుమ్రా, ఆశ్విన్‌లు మూడేసి వికెట్లు తీసుకోగా, ఇశాంత్ శర్మ, షమీలు రెండేసి వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ భారత్ 250 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరు క్యాచ్‌లు పట్టి టీమిండియా మాజీ వికెట్ కీపర్ ధోని రికార్డుని బద్దలు కొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications